నేడు కరీంనగర్‌కు పీసీసీ చీఫ్‌ మహేశ్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు కరీంనగర్‌కు పీసీసీ చీఫ్‌ మహేశ్‌

Jun 5 2026 4:17 AM | Updated on Jun 5 2026 4:17 AM

● మంత్రులతో కలిసి రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ ● మహిళా కానిస్టేబుల్‌కు డీజీపీ సీవీ. ఆనంద్‌ అభినందనలు

● మంత్రులతో కలిసి రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ శుక్రవారం కరీంనగర్‌ రానున్నట్లు డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఒక ప్రకటనలో తెలిపారు. సుడా నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో ఆయన పాల్గొంటారన్నారు. నగరంలోని రాజీవ్‌చౌక్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రాజీవ్‌ గాంధీ కాంస్య విగ్రహాన్ని, ఆధునీకరించిన ఐడీఎస్‌ఎంటీ భవనాన్ని ప్రారంభిస్తారని అన్నారు. ఐడీఎస్‌ఎంటీ భవన పక్కనే నిర్మించనున్న ఫుడ్‌కోర్టుకు శంకుస్థాపన చేస్తారన్నారు. మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లు పాల్గొంటారని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో కాంస్య పతకం

చిగురుమామిడి: మండలంలోని బొమ్మనపల్లికి చెందిన మహిళా కానిస్టేబుల్‌ గాడిపెల్లి శ్రీలత ఆల్‌ ఇండియా పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో కాంస్య పతకం సాధించారు. 2026– 27 పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో భాగంగా హర్యానాలో గత నెల 26,27 తేదీల్లో నిర్వహించిన వెయిట్‌ లిఫ్టింగ్‌ క్లస్టర్‌ పోటీల్లో కాంస్యం సాధించా రు. అనంతరం డీజీపీ సీవీఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీ శ్రీలతను అభినందించారు. శ్రీలత ప్రస్తుతం రామగుండం కమిషనరేట్‌ పరిధిలోని కమాన్‌పూర్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement