కరీంనగర్‌రూరల్: దశాబ్ధకాలంగా తప్పించుకు తిరుగుతున్న కరుడుగట్టిన నేరస్తుడిని కరీంనగర్‌రూరల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జిల్లాలో మోస్ట్ వాంటెడ్ అయిన మహ్మద్ అబ్దుల్ వాజిద్ అలియాస్ ధూమ్ ఖాలీద్ పదేళ్లుగా పోలీసులకు దొరక్కుండా తిరుగుతున్నాడు. గతంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఖాలీద్‌పై దాడిచేయగా రెండు కాళ్లు పోయాయి. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయగా బెయిల్‌పై బయటకు వచ్చి మహరాష్ట్ర పారిపోయి, నేరాలు కొనసాగించాడు. నాగపూర్, నాందేడ్, చంద్రపూర్, బల్లార్షా తదితర ప్రాంతాల్లో గ్యాంగులను ఏర్పాటు చేసుకున్నాడు. బిక్షగాడి వేషధారణలో దర్గాల వద్ద షెల్టర్ తీసుకుంటూ వాహనాల్లో తిరుగుతూ నేరాలకు పాల్పడేవాడు. హైదరాబాద్‌లో పలు నేరాలకు పాల్పడిన ధూమ్ ఖాలీద్‌పై కరీంనగర్‌రూరల్ పోలీస్‌స్టేషన్‌లో 5 కేసులు, వన్‌టౌన్‌లో 2, టుటౌన్‌లో 1 కేసు నమోదు కాగా నాందేడ్, నాగపూర్, బల్లార్షా, చంద్రపూర్‌లోనూ కేసులున్నాయి. కరీంనగర్‌లోని పలు స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదైన ఖాలీద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుచాలని, అతని కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. అతడి గురించి ఆరా తీస్తే చనిపోయాడని తెలిసింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని మేడిపల్లిలో ఉంటున్నట్లు పక్కా సమాచారం అందింది. ఆరు మాసాలుగా కరీంనగర్‌లో ఉంటున్న అతని భార్యను చంపాలని ప్రయత్నిస్తున్న ఖాలీద్ సోమవారం కరీంనగర్‌కు వచ్చాడనే సమాచారంతో కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరు పరిచారు.


