విరాట్ కోహ్లీ స్ఫూర్తితో క్రికెట్ ఆడుతున్నా. రాష్ట్రస్థాయి క్రికెట్‌లో చివరి మ్యాచ్‌లో అవకాశం వచ్చింది. 8 బంతుల్లో 24 పరుగులు చేశాను. మంచి బ్యాట్స్‌మెన్ కావాలన్నదే లక్ష్యం. సిరిసిల్లలో కోచ్‌లు బాగానే శిక్షణ ఇస్తున్నారు. మౌలిక వసతులున్న క్రికెట్ మైదానాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. – చేర్ల దీపక్, ఇంటర్ సెకండియర్
మహిళా క్రికెటర్ దీప్తిశర్మ అంటే ఇష్టం. అమ్మానాన్న క్రికెట్‌పై నాకున్న ఇష్టానికి ప్రాధాన్యమిచ్చి శిక్షణ ఇప్పిస్తున్నారు. మా ఇద్దరు కోచ్‌లు మెలకువలు నేర్పుతున్నారు. వేసవి సెలవుల్లో క్రికెట్ శిబిరాన్ని వినియోగించుకుంటున్నా. జాతీయస్థాయి పోటీల్లో రాణించి జీవితంలో డాక్టర్‌గా స్థిరపడాలన్నదే లక్ష్యం. – మోర హిమాని, 5వతరగతి


