శుభ వినాయక నమో నమామి
మొదటి పూజలు నీకే స్వామి
నిన్ను మ్రొక్కిన తొలగు విఘ్నములు
నీ చూపు సోకిన మంచి శకునములు
పిల్లల మంతా నిన్ను కొలిచెదము
విద్యా బుద్ధులు చక్కగ నొసగుము
తల్లి దండ్రులను పూజించావట
మాకు చూపుమా ఆ చక్కని బాట
నీ చల్లని కరుణ మాపై చూపుము
మా అజ్ఞానాన్ని రూపుమాపుము
నీ రూపం మాకు ఎంతో ఇష్టం
మా పిల్లలకు నీవే ప్రియదైవం
నిత్యము నిన్నే కొలుచెదము
నీ పూజలు చేసి మురిసెదము
– బూర దేవానందం
కవి, రచయిత, సిరిసిల్ల


