ప్రసవం అంటే చాలా మందిలో భయం ఉంటుంది. నొప్పి ఎలా ఉంటుంది. డెలివరీ ఎలా జరుగుతుంది. బిడ్డ ఆరోగ్యం ఎలా ఉంటుంది అనే ఆందోళనలు సహజం. కానీ, ఈ భయం కొన్నిసార్లు బీపీ పెరగడానికి, మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. యోగాలోని ధ్యానం, శ్వాసాభ్యాసాలు గర్భిణుల్లో ప్రశాంతతను పెంచుతాయి. తమ శరీరంపై విశ్వాసం పెరుగుతుంది. ప్రసవాన్ని ధైర్యంగా ఎదుర్కొనే మానసిక బలం వస్తుంది.
– అక్షయ, యోగా శిక్షకురాలు
జీవితంలో భాగం చేసుకోవాలి
గర్భిణులు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసంతో గడపాలంటే యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి. ఆహారం, విశ్రాంతి, సానుకూల ఆలోచనలు, తగిన వ్యాయామం.. ఇవన్నీ కలిసి తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడతాయి. అందులో యోగా ఒక సహజమైన, సురక్షితమైన మార్గంగా నిలుస్తోంది.
– డాక్టర్ నవీన, ఆర్‌ఎంవో


