గర్భిణులకు యోగా విధానాలు | - | Sakshi
Sakshi News home page

గర్భిణులకు యోగా విధానాలు

Jun 1 2026 4:01 AM | Updated on Jun 1 2026 4:01 AM

బాల్‌ ఎక్సర్‌సైజ్‌ : ప్రత్యేక యోగా బాల్‌తో చేసే వ్యాయామాలు నడుము, వెన్ను భాగాలపై ఒత్తిడిని తగ్గిస్తాయి. పెల్విక్‌ ప్రాంతం సడలించి ప్రసవానికి శరీరాన్ని సిద్ధం చేస్తాయి.

స్క్వాడ్‌ ఎక్సర్‌సైజ్‌ : స్క్వాడ్‌ వ్యాయామం వల్ల కాళ్ల కండరాలు బలపడతాయి. శరీరానికి సమతుల్యత పెరుగుతుంది. ప్రసవ సమయంలో ఉపయోగపడే కండరాలకు శక్తి అందుతుంది.

హిప్‌ రొటేషన్‌ : నడుము భాగాన్ని సాఫీగా కదిలించే ఈ వ్యాయామం కండరాల గట్టిదనాన్ని తగ్గించి సౌకర్యాన్ని కలిగిస్తుంది.

డక్‌వాక్‌ : ఇది కాళ్ల భాగాలకు బలం అందించడంలో ఉపయోగపడుతుంది. శరీర చురుకుదనం పెరుగుతుంది.

ప్రాణాయామం : శ్వాసపై దృష్టి పెట్టే ప్రాణాయామం గర్భిణులకు అత్యంత ప్రయోజనకరం. ఆందోళన తగ్గి, మెదడుకు తగిన ఆక్సిజన్‌ అందుతుంది. తల్లి శ్వాస సక్రమంగా ఉండటం బిడ్డ ఆరోగ్యానికీ మేలు చేస్తుంది.

చక్కీచలాసన్‌, మలాసన్‌ : ఈ ఆసనాలు కడుపు, నడుము, పెల్విక్‌ ప్రాంతాల్లో రక్తప్రసరణ మెరుగుపరచడంలో దోహదపడతాయి.

క్యాట్‌ అండ్‌ కౌపోజ్‌ : గర్భిణుల్లో ఎక్కువగా కనిపించే వెన్నునొప్పిని తగ్గించడంలో ఈ ఆసనం ఉపయోగపడుతుంది. శరీరానికి సౌలభ్యం పెరుగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement