డీఆర్వోగా స్వామి బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

డీఆర్వోగా స్వామి బాధ్యతల స్వీకరణ

May 31 2026 1:24 AM | Updated on May 31 2026 1:24 AM

కరీంనగర్‌ అర్బన్‌: కరీంనగర్‌ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)గా జే.స్వామి శనివారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయనకు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాలో తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న జే.స్వామికి ప్రభుత్వం ఇటీవల పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే. అనంతరం కలెక్టర్‌ చిత్రా మిశ్రాను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. గెజిటెడ్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళిచరణ్‌గౌడ్‌, గడ్డం సుధాకర్‌, ఎన్‌.రాజేశ్‌, తహసీన్‌, కె.లక్ష్మణ్‌ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement