కేన్సర్ల ముప్పు | - | Sakshi
Sakshi News home page

కేన్సర్ల ముప్పు

May 31 2026 1:24 AM | Updated on May 31 2026 1:24 AM

కేన్సర్ల ముప్పు

సిగరేట్‌, బీడీ, చుట్టా, జర్దా, గుట్కా, తంబాకు వంటి పొగాకు ఉత్పత్తులకు ప్రజలు బానిసలై విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వీటి బారిన పడిన వారికి తల, మెడ, నోరు, ఊపిరితిత్తులు, రక్త, మూత్రపిండాలు, ఫ్లీహము, పేగు, మూత్రసంచి, గర్భాశయ కేన్సర్లు వస్తున్నాయి. పక్షవాతం, అంధత్వము, చిగురువాపు, గుండె వ్యాధులు, నిమ్ము, ఆయాసం, రక్తనాళాలు గట్టిపడటం, సంతానోత్పత్తి తగ్గిపోవడం, ఎముకలు బలహీనపడుట వంటి దీర్ఘకాలిక వ్యాధులతో శరీరంలోని ప్రతి అవయవం దెబ్బతింటోంది. పొగాకు ఉత్పత్తులు వాడి ప్రజలు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. సిగరేట్లు కాల్చడమే కాదు.. ఆ పొగను పీల్చినా ప్రమాదమే. పొగాకు రహిత సమాజానికి అందరూ సహకరించాలి.

– డాక్టర్‌ లోకేశ్‌, జనరల్‌ ఫిజీషియన్‌

Advertisement
 
Advertisement
Advertisement