పొగాకు ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది | - | Sakshi
Sakshi News home page

పొగాకు ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది

May 31 2026 1:24 AM | Updated on May 31 2026 1:24 AM

పొగాకు ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది పొగాకు రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి చొప్పదండి బాలుర పాఠశాలకు జాతీయ అవార్డు పవర్‌కట్‌ ప్రాంతాలు

కరీంనగర్‌: పొగాకు ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం ఆవరణంలో సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తులైన సిగరెట్‌, బీడీ, తంబాకు, గుట్కా, కై నీ, జర్ద వినియోగించడం ద్వారా నోరు, గొంతు, ఊపిరితిత్తులు, ఆహార నాళం తదితర అవయవాలకు కేన్సర్‌ సోకుతుందని అన్నారు. డాక్టర్లు విప్లవ శ్రీ, సుధా, ఉమాశ్రీ, రవీందర్‌రెడ్డి, సన, సాజిద, శ్రీనివాస్‌, రాజగో పాల్‌, కై క, పోచయ్య, స్వామి పాల్గొన్నారు.

వైద్యుల పాత్ర కీలకం

చిన్నపిల్లల్లో టీబీ లక్షణాలను గుర్తించి వ్యాధి తీవ్రతను తగ్గించడంలో వైద్యుల పాత్ర కీలకమని డీఎంహెచ్‌వో వెంకటరమణ అన్నారు. వైదారోగ్యశాఖ సమావేశ మందిరంలో శనివారం టీబీ అలర్ట్‌ ఇండియా, స్టేట్‌ టీబీ సెల్‌ తెలంగాణ, సాథీ సంస్థల సహకారంతో చిన్నారుల్లో క్షయవ్యాధి (టీబీ) కేసులను ముందస్తుగాా గుర్తించడం, సమయానుకూలంగా చికిత్స అందించడం, వ్యాధి వ్యాప్తిని నివారించడంపై జిల్లాస్థాయి క్యాచ్‌– అఫ్‌ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి వైద్యాధికారి తమ పరిధిలోని అనుమానిత కేసులను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన పరీక్షలు నిర్వహించి, తగిన చికిత్స అందించాలన్నారు. టీబీ కంట్రోల్‌ ఆఫీసర్‌ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

కరీంనగర్‌క్రైం: జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.రాణి ఆదేశాల మేరకు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్‌లోని బీసీ స్టడీ సర్కిల్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయసేవా అధికార సంస్థ సభ్యులు, న్యాయవాదులు ఏ.కిరణ్‌ కుమార్‌, పెరుక రంగయ్య పటేల్‌, చిట్టి చంద్రప్రకాశ్‌ రెడ్డి అవగాహన కల్పించారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం, విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయం నేరమని వివరించారు. బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ ఎం.రవికుమార్‌, రిసోర్స్‌ పర్స న్లు ఏ.సంతోష్‌కుమార్‌, అశోక్‌ పాల్గొన్నారు.

చొప్పదండి: పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలను జాతీయస్థాయిలో మరో అవార్డు వరించింది. టోఫీ స్కూల్‌ చాలెంజ్‌– టువర్డ్స్‌ టొబాకో ఫ్రీ జనరేషన్‌– 2025 పోటీల్లో పాఠశాల జాతీయస్థాయిలో కన్సోలేషన్‌ బహుమతి సాధించింది. పొగాకు రహిత సమాజ నిర్మాణం, యువతలో ఆరోగ్య అవగాహన పెంపొందించడం, పొగాకు విని యోగం వల్ల కలిగే దుష్పరిమాణాలపై చైతన్యం కల్పించడం వంటి కార్యక్రమాలే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా అనేక పాఠశాలలు ఈ పోటీలో పాల్గొన్నాయి. విద్యార్థుల అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, పోస్టర్‌ ప్రదర్శనలు, ప్రతిజ్ఞ కార్యక్రమాలను బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు విశేషంగా నిర్వహించడంతో ఈ అవార్డు వరించింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాఠశాలకు చెందిన ప్రదాన ఉపాధ్యాయులు జంగం శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు యామ తిరుపతి అవార్డు స్వీకరించారు.

కొత్తపల్లి: విద్యుత్‌ స్తంభాల మార్పిడి పనులు చేపడుతున్నందున ఆదివారం ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు 11 కె.వీ.మంకమ్మతోట ఫీడర్‌ పరిధిలోని శ్రీరామ బుక్‌స్టాల్‌, బోదిసత్వా స్కూల్‌ ప్రాంతాలు, ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు 11 కె.వీ.ఐబీ ఫీడర్‌ పరిధిలోని ఐబీ చౌరస్తా, సర్కస్‌ మైదానం ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్‌ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement