పొగ.. ఆరోగ్యానికి సెగ | - | Sakshi
Sakshi News home page

పొగ.. ఆరోగ్యానికి సెగ

May 31 2026 1:24 AM | Updated on May 31 2026 1:24 AM

పొగ.. ఆరోగ్యానికి సెగ

ప్రాణాలు తీస్తున్న ధూమపానం

పొగాకు వినియోగంతో కేన్సర్‌ బారిన బాధితులు

నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

కరీంనగర్‌: యుక్త వయసులో సరదా కోసం మొదలు పెట్టే ధూమపానం చివరకు ప్రాణాలను హరి స్తోంది. సిగరేట్‌, బీడీ, తంబాకు వాడే అలవాటు వ్యసనంగా మారి మనిషిని బానిసను చేస్తోంది. స్మోకింగ్‌, పొగాకు ఉత్పత్తుల మోజులో పడి యువత భవిష్యత్‌ను అంధకారం చేసుకుంటోంది. కేన్సర్‌ బాధితుల్లో 40శాతం మంది పొగతాగటం, పొగాకు ఉత్పత్తులు వాడటం ద్వారానే మరణిస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. మే 31న పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా కథనం..

ఆకర్షితులవుతున్న యువత

యుక్తవయసులో సిగరేట్‌కు యువత ఆకర్షితులవుతున్నారు. పొగాకు ఉత్పత్తుల్లో నికోటిన్‌ ఉంటుంది. అందువల్ల వ్యసనం నుంచి త్వరగా బయటపడలేకపోతున్నారు. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ధూమపానం వల్ల పురుషులు, సీ్త్రలల్లో సంతానోత్పత్తి సమస్యలు వస్తున్నాయి.

జిల్లాలో ఇదీ పరిస్థితి

జిల్లాలో ప్రతి లక్ష మంది జనాభాకు 65 కేన్సర్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇది రాష్ట్ర సగటు (52 కేసులు) కన్నా చాలా ఎక్కువ. జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం కింద జిల్లాలో నిరంతరం ప్రత్యేక స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే ప్రభుత్వం చేపట్టిన ‘100 రోజుల టీబీ ముక్త్‌ అభియాన్‌’ ప్రచారంలో కరీంనగర్‌తో పాటు పరిసర 9 జిల్లాల్లో వేల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూశాయి. జిల్లాలోని వయోజన పురుష జనాభాలో దాదాపు 20శాతం నుంచి 25శాతం మంది ఏదో ఒక రూపంలో ధూమపానం (సిగరెట్లు, బీడీలు) లేదా పొగాకు ఉత్పత్తులను వాడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement