మంత్రి శ్రీధర్‌బాబు జన్మదిన వేడుకలు | - | Sakshi
Sakshi News home page

మంత్రి శ్రీధర్‌బాబు జన్మదిన వేడుకలు

May 31 2026 1:24 AM | Updated on May 31 2026 1:24 AM

కరీంనగర్‌ కార్పొరేషన్‌: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు జన్మదినోత్సవాన్ని కాంగ్రెస్‌ శ్రేణులు శనివారం నగరంలో ఘనంగా నిర్వహించారు. ఇందిరా చౌక్‌లో సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి కేక్‌కట్‌ చేశారు. ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల మైదానంలో వీర దేవేందర్‌ ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేసి, వాకర్స్‌కు రాగి జవా పంపిణీ చేశారు. అంబేద్కర్‌ స్టేడియంలో గుడిపాటి రమణ రెడ్డి ఆధ్వర్యంలో, పాలిటెక్నిక్‌ వెటర్నరీ కళాశాల మైదానంలో వాకర్స్‌, జీడీ రమేశ్‌ ఆధ్వర్యంలో కోర్ట్‌ సర్కిల్‌లో కేక్‌ కట్‌ చేశారు. కరీముల్లాషా దర్గాలో మైనారిటీలు పూల చదర్‌ సమర్పించారు. నాగుల సతీశ్‌ ఆధ్వర్యంలో కమాన్‌ వద్ద అన్నదానం చేశారు. హౌసింగ్‌ బోర్డుకాలనీలోని వీరబ్రహ్మేంద్ర వృద్ధులాశ్రమంలో నారోజు రాకేశ్‌ అన్నదానం నిర్వహించారు. కురుమవాడలో కర్రె పావని ఆహార ప్యాకెట్లు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ కర్ర రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement