త్వరలో డంప్‌యార్డ్‌ ప్రక్షాళన | - | Sakshi
Sakshi News home page

త్వరలో డంప్‌యార్డ్‌ ప్రక్షాళన

May 31 2026 1:24 AM | Updated on May 31 2026 1:24 AM

త్వరలో డంప్‌యార్డ్‌ ప్రక్షాళన ● నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌

● నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: డంప్‌యార్డ్‌ను త్వరలో పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ తెలి పారు. శనివారం డంప్‌యార్డ్‌ను సందర్శించి, బయోమైనింగ్‌ ప్రక్రియను, మంటలు, పొగలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బయోమైనింగ్‌ పనులు వేగవంతం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. డంప్‌ యార్డ్‌లో వ్యర్థాల వల్ల అంతర్గతంగా వాయువులతో మంటలుపుట్టి వెలువడుతున్న పొగను అదుపుచేయాలన్నారు. వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. డంప్‌ యార్డు ద్వారా స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బయోమైనింగ్‌ ప్రక్రియ వేగవంతం చేశామని అన్నారు.

బయోమైనింగ్‌ను వేగవంతం చేయాలి

డంప్‌యార్డ్‌ల్లో బయోమైనింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని సీడీఎంఏ శ్రీదేవి ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌ నుంచి కమిషనర్‌లతో వీసీలో మాట్లాడారు. నగరపాలకసంస్థ కార్యాలయం నుంచి కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కరీంనగర్‌ డంప్‌యార్డ్‌లో కొనసాగుతున్న బయోమైనింగ్‌ ప్రక్రియ పురోగతి, ప్లాస్టిక్‌ ఇతర ఘన వ్యర్థాలను అధునాతన యంత్రాల ద్వారా వేరు చేస్తున్న విధానం తదితర అంశాలను కమిషనర్‌ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement