మహిళల ఫిర్యాదులపై స్పందించాలి | - | Sakshi
Sakshi News home page

మహిళల ఫిర్యాదులపై స్పందించాలి

Feb 26 2026 7:30 AM | Updated on Feb 26 2026 7:30 AM

మహిళల ఫిర్యాదులపై  స్పందించాలి

మహిళల ఫిర్యాదులపై స్పందించాలి

మహిళల ఫిర్యాదులపై స్పందించాలి ● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే

● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే

కరీంనగర్‌టౌన్‌/కొత్తపల్లి(కరీంనగర్‌): మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి, చర్యలు తీసుకో వాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో బుధవారం మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిర్మూలన చట్టం–2013పై అవగాహన కల్పించారు. లోకల్‌ కమిటీ మెంబర్‌ రాజారెడ్డి పని ప్రదేశాల్లో మహిళల రక్షణకు ఈ చట్టం ఎంత ముఖ్యమో వివరించారు. ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ.. మండలస్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపల్‌ పరిధి లో కమిషనర్లు నోడల్‌ అధికారులుగా వ్యవహరించాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి పాల్గొన్నారు.

పరీక్షలకు సిద్ధం చేయండి

పదోతరగతి పరీక్షలు వచ్చే నెల 14వ తేదీ నుంచి జరగనున్న నేపథ్యంలో విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అడిషనల్‌ కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే సూచించారు. కొత్తపల్లి మండలం చింతకుంట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించా రు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడా రు. మోడల్‌ పరీక్ష జవాబు పత్రాలను పరిశీ లించి విద్యార్థుల ప్రగతిని తెలుసుకున్నారు. 100శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్‌ అశోక్‌రెడ్డి, మండల విద్యాధికారి ఆనందం, ప్రధానోపాధ్యాయులు శోభారాణి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement