మల్లన్నకు పెద్దపట్నం
మానకొండూర్: మానకొండూర్ మండలం రంగపేట గ్రామంలో మేడలాంబ, కేతకాంబ సమేత మల్లికార్జునస్వామి పట్నాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఒగ్గుపూజారులతో ఆదివారం మల్లన్నకు పెద్దపట్నం వేశారు. అనంతరం స్వామివారి కల్యాణం వైభవంగా జరిపించారు. గ్రామస్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్య అతిథులుగా కరీంనగర్ 10వ డివిజన్ కార్పొరేటర్ సౌగాని కొమురయ్య యాదవ్, జిల్లా ప్రాథమిక గొర్రెల పెంపకం దారుల సహకార సంఘ చైర్మన్ బాషబోయిన మల్లేశం యాదవ్, కాల్వ సురేశ్ యాదవ్, కొక్కు దెవేందర్ యాదవ్, బండి మల్లయ్య యాదవ్ హాజరై స్వామివారిని దర్శించు కున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొత్త రాంరెడ్డి, ఉప సర్పంచ్ వేల్పుల కొమురయ్య, యాదవ సంఘం అధ్యక్షుడు రాకేష్ యాదవ్ , ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.
మల్లన్నకు పెద్దపట్నం


