మద్యం మత్తులో జారిపడి యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో జారిపడి యువకుడి మృతి

Feb 21 2026 7:05 AM | Updated on Feb 21 2026 7:05 AM

మద్యం మత్తులో జారిపడి యువకుడి మృతి

మద్యం మత్తులో జారిపడి యువకుడి మృతి

కేసు నమోదు

ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్‌ గ్రామానికి చెందిన గొర్రె అనిల్‌(30) మద్యం మత్తులో కాలు జారిపడి మృతిచెందాడు. పొత్కపల్లి ఎస్సై రమేశ్‌ కథనం ప్రకారం.. మూడురోజులుగా చిత్తుగా మద్యం తాగుతున్న అనిల్‌.. గురువారం కూడా బాగా తాగాడు. రాత్రి బాత్‌రూంకు వెళ్లి కాలుజారి పడడంతో తల వెనుకాల బలమైన గాయమంది. తీవ్రరక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇసుక ట్రాక్టర్‌ కింద పడి..

కోనరావుపేట(వేములవాడ): మండలంలోని కొండాపూర్‌ ఇసుక రీచ్‌ వద్ద ఇసుక ట్రాక్టర్‌ కింద పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు. మండలంలోని నిజామాబాద్‌కు చెందిన తాళ్లపల్లి రవి(45) ట్రాక్టర్‌ నడిపే కూలీగా అదే గ్రామానికి చెందిన శోభన్‌ ట్రాక్టర్‌పై వెళ్లాడు. సాయంత్రం సమయంలో ఇసుకను నింపుకుని వస్తుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడగా ట్రాక్టర్‌ టైర్లు పై నుంచి వెళ్లాయి. తీవ్రంగా గాయనడిన రవిని 108 అంబులెన్స్‌లో సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. సంఘటన స్థలాన్ని ఎస్సై ప్రశాంత్‌రెడ్డి సందర్శించి ట్రాక్టర్‌ను ఠాణాకు తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేస్తామన్నారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

అంగన్‌వాడీ టీచర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని వెంకటాపూర్‌కు చెందిన కొంపెల్లి లక్ష్మి–విజయ్‌కుమార్‌ దంపతుల కుమారుడు విధ్వాన్ష్‌(3)ను అకారణంగా కొట్టిన అంగన్‌వాడీ టీచర్‌ సల్వాని రాణిపై పోలీసులు శుక్రవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బా లుడిని కులం పేరుతో దూషించడమే కాకుండా దాడి చేసినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫి ర్యాదు చేశారు. ఎస్సై రాహుల్‌రెడ్డి కథనం ప్ర కారం.. అంగన్‌వాడీ కేంద్రంలో చదువుతున్న విధ్వాన్ష్‌ అనే బాలుడిని ఎలాంటి కారణం లేకుండా టీచర్‌ కొట్టడంతో కంటితోపాటు చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేసి, టీచర్‌ అకారణంగా బాలుడిని కొట్టినట్లు నిర్ధారించుకొని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా బాలుడిని చితకబాదిన అంగన్‌వాడీ టీచర్‌పై ఇప్పటికే మానవహక్కుల కమిషన్‌ విచారణ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. టీచర్‌కు కలెక్టర్‌ షోకాజ్‌ నోటీస్‌ జారీ చేశారు. బాలుడికి మెరుగైన చికిత్స అందిస్తున్పట్లు కలెక్టర్‌ ప్రకటించారు.

ధర్మపురి: రెండు బొలోరో వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్‌ తెలిపారు. ధర్మపురికి చెందిన వేముల రాజేశ్‌కు చెందిన రెండు వాహనాలు ప్రతి రోజు జాతీయ రహదారి పక్కనున్న తన ఇంటి ముందు పార్కింగ్‌ చేస్తుంటారు. గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వాహనాల టైర్లలో గాలి తీసి వాటిని ధ్వంసం చేశారు.

25 నుంచి ఇంటర్‌ పరీక్షలు

సిరిసిల్లక్రైం: ఇంటర్‌ పరీక్షల కేంద్రాల వద్ద 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ అమలులో ఉంటుందని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్‌ సెంటర్లు మూసివేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement