వైభవంగా చక్రస్నానం
కరీంనగర్ కల్చరల్: కరీంనగర్‌లోని మార్కెట్‌రోడ్ శ్రీ వేంకటేశ్వరాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం మహాపూర్ణహుతి నిర్వహించారు. యాగశాలలో ఆరాధన, సేవాకాలం, చతుస్థానార్చన, మూల మంత్ర హవనం జరిపారు. ప్రత్యేక వేదికపై వసంతోత్సవం, సుగంధ ద్రవ్యాలతో తిరుమంజనం జరిపారు. చక్రస్నానం, ఉత్సవ మూర్తులకు శ్రీ పుష్పయాగం జరిపారు. ధ్వజ అవరోహణం, పండిత సన్మానం, మహాదాశీర్వచనంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఫిబ్రవరి 1న ఆదివారం మార్క్‌ఫెడ్ మైదానం నుంచి శోభాయాత్ర ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
● ముగిసిన బ్రహ్మోత్సవాలు
● ఫిబ్రవరి ఒకటిన శోభాయాత్ర
వైభవంగా చక్రస్నానం


