నామినేషన్ల ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలి
జమ్మికుంట/హుజూరాబాద్: మున్సిపల్ ఎన్ని కల నామినేషన్ల ప్రక్రియలో పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. బుధవారం జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయాల్లో నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించారు.రోజూవారీగా నామినేషన్ల వివరాలు టీపోల్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలన్నా రు. కమిషనర్ ఎండీ.అయాజ్, తాహసీల్దార్ వెంకట్‌రెడ్డి, టౌన్ సీఐ రామకృష్ణ పాల్గొన్నారు.
ర్యాండమైజేషన్ పూర్తి
కరీంనగర్ అర్బన్: మున్సిపల్ ఎన్నికలకు ర్యాండమైజేషన్‌లో మొదటి దశ సిబ్బంది కేటాయింపు కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో పూర్తయింది. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడేతో కలిసి బ్యాలెట్ బాక్సులు, విధులు నిర్వహించే సిబ్బంది ఏర్పాట్లపై చర్చించారు.
ఎన్నికల పరిశీలకుడిగా జితేందర్‌రెడ్డి
జిల్లా మునిసిపల్ పరిశీలకులుగా హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ జి.జితేందర్‌రెడ్డిని నియమించగా ఆడిట్ పరిశీలకులుగా పెద్దపల్లి జిల్లా ఆడిట్ ఆఫీసర్ ఎం.మనోహర్‌ను నియమించారు. బుధవారం జిల్లాకు వచ్చిన సదరు అధికారులు కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఎన్నికలకు ఏర్పాట్లపై చర్చించారు.
కరీంనగర్ అర్బన్/కరీంనగర్ కల్చరల్: రంజా న్ మాసం ఫిబ్రవరి 17నుంచి ప్రారంభమవుతున్నందున మసీదులు, ఈద్గాల వద్ద సౌకర్యాలు కల్పించాలని అదనపు కలెక్టర్ అశ్విని తానా జీ వాకడే ఆదేశించారు. రంజాన్ మాసం ఏర్పాట్లపై బుధవారం సమీక్ష నిర్వహించారు. సామూహిక ప్రార్థనలు చేసే ప్రాంతాల్లో పారి శుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, తాగునీరు, వసతులు కల్పించాలని సూచించారు. వీధిలైట్లు మరమ్మతు ఉన్నచోట కొత్తవి అమర్చాలని సూచించారు. రద్దీ ఉన్నచోట ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని ఏసీపీకి సూచించారు. అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీవో మహేశ్వర్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ పాల్గొన్నారు.
కరీంనగర్‌టౌన్: మేడారం మహా జాతర జరిగే తేదీల్లోనే మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించడం సరికాదని మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. కరీంనగర్‌లో బుధవారం మాట్లాడుతూ.. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం మహా జాతర సమయంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మతసామరస్యాన్ని కాపాడాల్సిన బా ధ్యత లేకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలుబొమ్మగా ఎన్నికల కమిషన్ కొమ్ము కాస్తోందన్నారు. ఎన్నికల షెడ్యూల్ ఎవరి కోరిక మేరకు విడుదల చేశారో తెలియజేయాలన్నారు. రాష్ట్ర ప్రజలంతా జాతరలో ఉంటే నామినేషన్లు ఎలా వేయగలరని, జాతర ముగిసిన తర్వాత షెడ్యూల్ విడుదల చేయాల ని డిమాండ్ చేశారు. కంసారం తిరుపతి, తుల భాస్కర్‌రావు, గోసికె అజయ్ పాల్గొన్నారు.
జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్లో క్వింటాల్ పత్తి గరిష్టంగా రూ.7,950 పలికింది. బుధవారం మార్కెట్‌కు 68 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,600, కనిష్ట ధర రూ.7,150కు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయవిక్రయాలను ఇన్‌చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.
నామినేషన్ల ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలి
నామినేషన్ల ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలి


