సిటీలో తొలిరోజు 76 నామినేషన్లు
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో బుధవారం 76 నామినేషన్లు వచ్చాయి. నగరపాలకసంస్థకార్యాలయంలో 33 కౌంటర్లు, హెల్ప్ డెస్క్, సెక్యూరిటీ డిపాజిట్ కౌంటర్, నామినేషన్ పత్రాలు ఇచ్చే కౌంటర్ ఏర్పాటు చేశారు. దాదా పు 1200 నామినేషన్ పత్రాలను ఆశావహులు తీసుకెళ్లారు. మొదటి రోజు 76 మంది 80 సెట్లు దాఖలు చేశారు. 3వ డివిజన్‌కు అధికంగా ఐదు నామినేషన్లు వచ్చాయి. 4, 5, 6, 17, 18,19, 22,24,27,31,32,33,34,41,42,49,54,55,58,60,62 డివిజన్లలో ఒక్క నామినేషన్ రాలేదు. పార్టీలపరంగా ఆప్, బీఎస్పీ నుంచి ఒక్కోటి, బీజేపీ నుంచి 32, కాంగ్రెస్ నుంచి 25, ఎంఐఎం నుంచి 3, బీఆర్‌ఎస్ నుంచి 13, స్వతంత్రులు, ఇతరులు5 నామినేషన్ల సెట్లు దాఖలు చేశారు.
నో డ్యూ కోసం రద్దీ
అభ్యర్థులు ఇంటి,నల్లా పన్ను బకాయిలు లేకుండా ఉండాలనే నిబంధనతో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన నోడ్యూ కౌంటర్ వద్దకు పోటెత్తారు. తాము చెల్లించిన రశీదులు చూపించి, నో డ్యూ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకొన్నా రు. సర్టిఫికెట్ సకాలంలో ఇవ్వకపోవడంతో కొందరు నామినేషన్ వేయకుండానే వెనుదిరిగారు.
పత్రాలు లేక పరేషాన్
షెడ్యూల్ విడుదలైన మరుసటి రోజే నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో చాలా మంది తొలిరోజు నామినేషన్ దాఖలు చేయలేకపోయా రు. ఇంటి,నల్లాపన్నులు క్లియర్ లేకపోవడం, కొత్తగా బ్యాంక్‌ఖాతా,ప్రతిపాదకులపై స్పష్టతకో సం కార్యాలయంలో తిరుగుతూ కనిపించారు. స్వతంత్ర అభ్యర్థికి పది మంది ప్రతిపాదకులు కావాలంటూ సోషల్ మీడియాలో ప్రచా రం జరగడంతో, గందరగోళానికి గురయ్యారు. ఒక్కరు సరిపోతారని అధికారులు స్పష్టం చేశారు.
పర్యవేక్షించిన కమిషనర్
నామినేషన్ల ప్రక్రియను నగరపాలకసంస్థకమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ పర్యవేక్షించారు. 33 ఆర్‌వో గదులతో పాటు, కార్యాలయ ఆవరణలో హెల్ప్‌డెస్క్‌లు, వివిధ కౌంటర్‌లను స్వయంగా పరిశీ లించారు. సీఐలు రామచందర్, సృజన్‌రెడ్డి, తిరుమల్‌గౌడ్ బందోబస్తు చేపట్టారు.
మున్సిపాలిటీల్లో 36 నామినేషన్లు
జమ్మికుంట/హుజూరాబాద్/చొప్పదండి: జమ్మికుంటలో తొలిరోజు 11 నామినేషన్లు దాఖలయ్యాయి. 3,6,10,11,15,16,20,27,28,30 వా ర్డులకు నామినేషన్లు వేశారు. పార్టీల పరంగా బీజేపీ3, కాంగ్రెస్5, బీఆర్‌ఎస్1, ఇండిపెండెంట్–2 నామినేషన్లు వేశారని అఽధికారులు తెలిపారు. హుజూరాబాద్‌లో 15 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. చొప్పదండిలో 10 నామినేషన్లు దాఖలయ్యాయి. 6వ, 10వ, 12వ వార్డులలో రెండు చొప్పున, 1వ, 3వ, 8వ, 11వ వార్డులలో ఒక్కటి చొప్పున దాఖలయ్యాయి.


