సింహవాహనంపై శ్రీవారు
కరీంనగర్ కల్చరల్: కరీంనగర్ మార్కెట్ రోడ్డు శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం సుప్రభాత, అన్నకూటోత్సవ సేవ, యాగశాలలో సుదర్శన హోమం నిర్వహించారు. శ్రీవారు ఉదయం సింహ వాహనంపై, సాయంత్రం హనుమత్ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహరించారు. ఉత్సవ మూర్తుల ఎదుట సహస్ర దీపాలంకరణ సేవ నేత్రపర్వంగా కొనసాగింది. ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఈవో కందుల సుధాకర్ పాల్గొన్నారు. గోగుల ప్రసాద్ సారథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
సింహవాహనంపై శ్రీవారు
సింహవాహనంపై శ్రీవారు


