బిర్యానీ సెంటర్‌లో అగ్ని ప్రమాదం
ధర్మపురి: చికెన్ బిర్యానీ సెంటర్‌లో అగ్ని ప్రమాదం జరిగి రూ.20లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. యజమాని ఎండీ.అనాస్ కథనం ప్రకారం.. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో అనాస్ తండ్రి సాబీర్ మూడేళ్లుగా చికెన్ బిర్యానీ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. సాబీర్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. అనాస్ సెంటర్ నడిపిస్తున్నాడు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి 11.30గంటల సమయంలో సెంటర్ మూసి ఇంటికి వెళ్లారు. బుధవారం వేకువజామున పెద్దఎత్తున మంటలు చెలరేగినట్లు స్థానికులు సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా ఫైరింజన్ సిబ్బంది సహాయంతో మంటలను ఆర్పి వేశారు. ప్రమాదంలో రూ.20లక్షలకు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. రెవెన్యూ సిబ్బంది పంచనామా చేపట్టారు.
మంటలార్పిన ఫైరింజన్
రూ.20లక్షలకు పైగా ఆస్తి నష్టం


