
కరీంనగర్
న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025
మా భూమి.. మా దేశం.. మా ప్రాంతం.. మా సొత్తు.. మా మనుషులు నినాదంతో ఎందరో మహనీయుల పోరాటాలతో సాధించుకున్న స్వాతంత్య్ర భారతదేశం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఉద్యమ సమయం నాటి అనేక సంఘటనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇంకా కళ్లముందు కదలాడుతున్నాయి. స్వాతంత్య్ర పోరాటానికి వేదికై న మెట్‌పల్లి ఖాదీప్రతిష్టాన్ విదేశీ వస్తు బహిష్కరణలో కీలక పాత్ర పోషించింది. తాజాగా పొలిటికల్ బ్రాండ్‌గా పేరొందుతోంది. ఉమ్మడి జిల్లానుంచి ఎందరో మహనీయులు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అమరులైన వారి పేరిట శిలాఫలకాలు ఆయా ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. నాటికీ.. నేటికీ పరిస్థితులు మారాయి. 78 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. అయినప్పటికీ విద్య, వైద్యం, చట్టాలపై మరింత చైతన్యం రావాల్సిన అవసరం ఉందని నేటి యువత అంటోంది. 2047 నాటికి వందేళ్ల భారతదేశాన్ని పునర్నిర్మిస్తామని సగర్వంగా చెబుతోంది. నేడు 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా..
కరీంనగర్‌క్రైం/హుజూరాబాద్: ‘కఠిన చట్టాలు తీసుకొచ్చి, బలమైన సైన్యాన్ని సిద్ధం చేసుకుంటాం. నవ భారత నిర్మాణానికి నాంది పలికి, దేశాన్ని పునర్‌నిర్మిస్తాం’ అంటూ నేటి యువత ప్రతిజ్ఞ పూనుతున్నారు. ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలంటే సైన్యాన్ని మరింత పటిష్టం చేయాలని, విద్యా, సాంకేతిక రంగాల్లో మార్పులు అవసరమని చెబుతున్నారు. డ్రగ్స్ ముప్పును మట్టికరిపించకపోతే మనవజాతి మనుగడ కష్టతరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చట్టపరమైన వ్యవస్థ పటిష్టంగా పని చేయాలని కోరుకుంటున్నారు. శుక్రవారం పంద్రాగస్టు సందర్భంగా 2047 నాటికి వందేళ్ల స్వాతంత్య్ర భారతదేశం ఎలా ఉండాలనే అంశంపై కరీంనగర్‌లోని వాగేశ్వరి డిగ్రీ,పీజీ కళాశాల, హుజూరాబాద్ మండలం సింగాపూర్‌లోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన టాక్‌షోలో విద్యార్థులు పాల్గొని, తమ అభిప్రాయాలు వెల్లడించారు.

కరీంనగర్

కరీంనగర్

కరీంనగర్

కరీంనగర్