
ఓట్ల చోరీని అడ్డుకోవాలి
కరీంనగర్ కార్పొరేషన్: ఎన్నికల కమిషన్‌తో కలిసి బీజేపీ చేస్తున్న ఓట్ల చోరీని అడ్డుకోవాలని డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లిసత్యనారాయణ అన్నారు. ఓట్‌చోరీకి నిరసనగా గురువారం రాత్రి నగరంలో కాంగ్రెస్ ప్రదర్శన నిర్వహించింది. ఇందిరాచౌక్ నుంచి బస్‌స్టేషన్ వరకు కొవ్వొత్తులతో నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు స్వతంత్రంగా వ్యవహరించిన ఎన్నికల కమిషన్ ప్రస్తుతం మోదీ చేతిలో కీలుబొమ్మలా మారిందని విమర్శించారు. జిల్లా గ్రంథాలయసంస్థ అధ్యక్షుడు సత్తు మల్లేశం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్, నాయకులు వుట్కూరి నరేందర్‌రెడ్డి, కర్ర సత్యప్రసన్న,ఆరెపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు.