
డ్రగ్స్ కట్టడికి కలిసి రావాలి
కరీంనగర్‌క్రైం: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీపీ గౌస్ ఆలం పిలుపునిచ్చారు. ‘నిషా ముక్త్ భారత్ అభియాన్’ ఐదోవార్షికోత్సవం సందర్భంగా కమిషనరేట్ కార్యాలయంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ లేని సమాజమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు విజయకుమార్, శ్రీనివాస్, సతీశ్, శ్రీనివాస్‌జి పాల్గొన్నారు.
భరోసా కేంద్రం తనిఖీ
కొత్తపల్లిలోని భరోసా కేంద్రాన్ని సీపీ గౌస్‌ఆలం తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడి, రికా ర్డులను పరిశీలించారు. కేసుల వివరాలను పరిశీలించి, నిందితులకు శిక్షలు పడేలా, బాధితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఐ శ్రీలత, సిబ్బంది పాల్గొన్నారు.
పరేడ్ ఏర్పాట్లపై సమీక్ష
78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను సీపీ గౌస్ ఆలం పరేడ్‌గ్రౌండ్‌లో సమీక్షించారు. పరేడ్ రిహార్సల్స్‌ను వీక్షించారు. పరేడ్‌లో పాల్గొంటున్న పోలీసులు, ఇతర విభాగాల కవాతును పరిశీలించి, సూచనలు చేశారు. పరేడ్ భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.