
డిజిటల్ లంచం
పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి కొత్త పుంతలు తొక్కుతోంది. డిజిటల్ పద్ధతిలో లంచం తీసుకున్న సర్వేయర్ సునీల్‌ను అవినీతి నిరోధక శాఖ అధికా రులు పూర్తిఆధారాలతో అదుపులోకి తీసుకున్నారు. పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఈ ఘ టన చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ విలేకరులకు వెల్లడించిన వివరాలిలు.. పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన చెరకు నాగార్జునరెడ్డి తన భూమి సర్వే కోసం సుమారు 8 నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. గతనెలలో సర్వే పూర్తిచేసినా సర్వేయర్ నివేదిక ఇవ్వడంలేదు. రిపోర్టు ఇవ్వాలని కోరితే రూ.20వేలు లంచం కావాలని డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని రూ.6వేలు ఇస్తానన్నా వినలేదు. చివరకు రూ.10వేల కు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని అధికా రుల దృష్టికి తీసుకెళ్లిన నాగార్జునరెడ్డి.. ఏసీబీ అధికారుల సూచనలమేరకు ఆ మొ త్తాన్ని ప్రైవేట్ అసిస్టెంట్ రాజేందర్‌రెడ్డికి ఫోన్‌పే చేశారు. ఆయన ద్వారా సర్వేయర్ ఫోన్ పే చేయించుకున్నాడు. పూర్తిఆధారాలతో వచ్చిన ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో విచారణ జరి పారు. సర్వేయర్ సునీల్, ప్రైవేట్ అసిస్టెంట్ రాజేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. 24గంటల్లోగా రిమాండ్‌కు తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ తెలిపారు.
ఫోన్‌పే ద్వారా డబ్బులు తీసుకున్న సర్వేయర్
ఆధారాలతోవచ్చి పట్టుకున్న ఏసీబీ అధికారులు

డిజిటల్ లంచం