
కరీంనగర్ అభివృద్ధికి నిధులు ఇవ్వండి
● సీఎంకు వెలిచాల రాజేందర్‌రావు విజ్ఞప్తి
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు కోరారు. ఈమేరకు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి విన్నవించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సమస్యలు, పరిష్కారం, అవసరమైన నిధుల గురించి చర్చించారు. నగరంలో అభివృద్ధి పనులు కొనసాగేందుకు నిధులు కేటాయించాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకుంటామని తెలిపారు. ముఖ్యంగా నగరపాలక సంస్థలో అత్యధికంగా కార్పొరేటర్ స్థానాలను గెలుచుకొని మేయర్ పీఠాన్ని కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం ఇప్పటి నుంచి పార్టీ నాయకులంతా సమన్వయంతో ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కాగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాలని, నగరపాలకసంస్థలో కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని సీఎం సూచించినట్లు రాజేందర్‌రావు తెలిపారు.