
ఉన్నత లక్ష్యాలు ఏర్పర్చుకోవాలి
చొప్పదండి: విద్యార్థులు పాఠశాల సమయంలోనే ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని వాటి సాధనకు క్రమ శిక్షణ కలిగి ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. పట్టణంలోని పీఎంశ్రీ నవోదయ విద్యాలయంలో హైదరాబాద్ రీజియన్ ఖోఖో పోటీల ముగింపు కార్యక్రమానికి హాజరై విజేతలకు మెమొంటోలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక దారుఢ్యానికి ఉపయోగపడుతాయని, క్రీడల్లో ప్రతిభ కనబరచడం ద్వారా దేశవ్యాప్త కీర్తిని పొందాలని సూచించారు. క్రీడల ముగింపు సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఫైనల్ మ్యాచ్‌లో వివిధ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అండర్ 14 బాలుర విభాగంలో బీదర్ జట్టు గెలుపొందగా, కృష్ణా జట్టు రన్నరప్‌గా, బాలికల విభాగంలో విన్నర్‌గా కృష్ణా జట్టు, రన్నర్‌గా షిమోగా జట్లు నిలిచాయి. అండర్–17 బాలుర విభాగంలో విన్నర్‌గా బీదర్, రన్నర్‌గా తుంకూర్ జట్టు, బాలికల విభాగంలో విన్నర్‌గా బీదర్, రన్నర్‌గా కృష్ణా జట్టు నిలిచాయి. అండర్– 19 బాలుర విభాగంలో బీదర్ జట్టు విన్నర్‌గా, రన్నర్‌గా కడప జట్టు, బాలికల విభాగంలో విన్నర్‌గా ఖమ్మం జట్టు, రన్నర్‌గా బీదర్ జట్లు నిలిచాయి. ప్రిన్సిపాల్ మంగతాయారు పాల్గొన్నారు.
‘డబుల్’ ఇళ్లు సిద్ధం చేయండి
కొత్తపల్లి(కరీంనగర్): చింతకుంటలోని డబుల్ బెడ్‌రూం ఇండ్లలో వసతులు కల్పించి సిద్ధం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశింంచారు. పెండింగ్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. చింతకుంటలోని డబుల్ బెడ్‌రూం సముదాయాలను గురువారం అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి పరిశీలించారు. పెండింగ్ పనులపై ఆరా తీశారు. త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఆర్‌అండ్‌బీ ఈఈ నరసింహాచారి పాల్గొన్నారు.
కలెక్టర్ పమేలా సత్పతి
ముగిసిన జేఎన్‌వీ రీజియన్ ఖోఖో పోటీలు