
తల్లిపాల ప్రాముఖ్యతను వివరించాలి
● అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే
కరీంనగర్: తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఈనెల 7వరకు నిర్వహించనున్న కార్యక్రమాల్లో తల్లిపాల ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రచారం చేయాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సూచించారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో తల్లిపాల వా రోత్సవాల నిర్వహణ సమన్వయ సమావేశం కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగింది. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ ఐసీడీఎస్, ఆరోగ్యశాఖ సమన్వయంతో అంగన్వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు, ఆరోగ్య, పోషన్ అభియాన్ సిబ్బంది తల్లిపాల ప్రాధాన్యతను వివరించాలన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతను వివరించే పోస్టర్లు బ్యానర్లు ప్రదర్శించాలని తెలిపారు. గ్రామాల్లో, వార్డుల్లో అన్నప్రాసన, అక్షరాభ్యాసం, సీమంతం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. అనంతరం వారోత్సవాల పోస్టర్లు ఆవిష్కరించారు.
ఫేస్ రికగ్నేషన్ హాజరుకు సర్వర్ సమస్య
కరీంనగర్‌రూరల్: ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం నుంచి ఉపాధ్యాయుల హాజరు కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ విధానానికి సాంకేతిక సమస్యలేర్పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఉపాధ్యాయులందరూ యాప్‌ను వినియోగించడంతో సర్వ ర్ సమస్య తలెత్తింది. జిల్లాలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులు స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని లాగిన్ అయిన తర్వాత ఉదయం 8.50గంటలకు నిర్ధేశిత సమయంలో ఫేస్ రికగ్నేషన్ హాజరు వేసుకున్నారు. అనంతరం పాఠశాల ముగింపు సమయంలో తిరిగి హాజరు వేసుకోవడం జరిగింది. ప్రారంభంలో యాప్ వినియోగించడంలో నెలకొన్న సాంకేతిక సమస్యలతో కొంత జాప్యమేర్పడిందని పలువురు ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
హాస్టల్‌లో మెనూ పాటించాలి
కరీంనగర్ కార్పొరేషన్: ప్రభుత్వం రూపొందించిన ప్రకారం మెనును హాస్టల్‌లో తప్పకుండా పాటించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని ముకరంపుర కళాశాలస్థాయి వసతిగృహాన్ని సందర్శించారు. హాస్టల్‌ను పరిశీలించారు. కిచెన్‌ను తనిఖీ చేశారు. మెనూ పాటిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. హాస్టల్ విద్యార్థుల కోసం ప్రభుత్వం డైట్ చార్జీలు పెంచిందన్నారు. మెనూ ప్రకారం ఆహారం అందించే విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని వార్డెన్‌కు సూచించారు.
పవర్‌కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11 కేవీ.అంబేద్కర్‌నగర్ ఫీడర్ పరిధిలోని అంబేద్కర్‌నగర్, శివాజీనగర్, ఎస్టీకాలనీ, కిసాన్‌నగర్ ప్రాంతాలతో పాటు విద్యుత్ లైన్ల షిఫ్టింగ్ పనులు చేపడుతున్నందున ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కె.వీ.భగత్‌నగర్ ఫీడర్ పరిధిలోని ఎర్రగట్టు, వాసుదేవకాలనీ, న్యూ శ్రీనగర్‌కాలనీ, కట్టరాంపూర్, ఆయోధ్యకాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీఈలు పంజాల శ్రీనివాస్ గౌడ్, ఎం.లావణ్య తెలిపారు. చెట్ల కొమ్మల తొ లగింపు పనులు చేపడుతున్నందున ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కె.వీ.తీగలగుట్టపల్లి ఫీడర్ పరిధిలోని సరస్వతీనగర్, విద్యారణ్యపురి, తీగలగుట్టపల్లి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు.

తల్లిపాల ప్రాముఖ్యతను వివరించాలి

తల్లిపాల ప్రాముఖ్యతను వివరించాలి

తల్లిపాల ప్రాముఖ్యతను వివరించాలి