
శాంతి భద్రతలకు విఘాతం కల్గించొద్దు
● పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ● కొత్తపల్లిలో కార్డన్ సెర్చ్
కొత్తపల్లి(కరీంనగర్): శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ గౌస్‌ఆలం హెచ్చరించారు. కొత్తపల్లిలో శుక్రవారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పాత నేరస్తులపై ఆరా తీశారు. సరైన ధ్రువపత్రాలు లేని 45వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సీపీ మాట్లాడుతూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసర సమయంలో డయల్ 100 ద్వారా లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. డ్రగ్ రహిత సమాజ నిర్మాణం కోసం పాటుపడతామని స్థానికులు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, ట్రాఫిక్ నియమాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, షీం టీంలతో అవగాహన కల్పించారు. టౌన్ ఏసీపీ వెంకటస్వామి, సీఐలు నిరంజన్‌రెడ్డి, పుల్లయ్య, ప్రదీప్‌కుమార్, శ్రీలత పాల్గొన్నారు.