
8న బీఆర్‌ఎస్ ‘బీసీ గర్జన’
కొత్తపల్లి(కరీంనగర్): ‘మేమెంతో మాకంతా’ అనే డిమాండ్‌తో రాష్ట్ర సాధన పోరాట తరహాలోనే బీసీ ఉద్యమాన్ని బీఆర్‌ఎస్ పార్టీ చేపడుతోందని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి స్పష్టం చేశారు. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగరంగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8వ తేదీన కరీంనగర్‌లోని జ్యోతిరావు ఫూలే మైదానంలో నిర్వహించే బీసీ గర్జన బహిరంగ సభకు కదలిరావాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివా స్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్‌తో కలిసి శుక్రవారం జ్యోతిరా వు ఫూలే మైదానాన్ని పరిశీలించారు. చింతకుంటలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మధుసూదనాచారి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు రాష్ట్రవతి వద్ద పెండింగ్‌లో ఉండగానే ఆర్డినెన్స్ తెస్తామనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. పలుమార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి ఏనాడు రాష్ట్రపతి, పార్లమెంట్‌లో ఆమోదించే విధంగా ఒత్తిడి తేలేదని విమర్శించారు. రేవంత్ ట్రాప్‌లో పడ్డ కాంగ్రెస్ హైకమాండ్ బీసీలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కరీంనగర్ బీఆర్‌ఎస్‌కు సెంటిమెంట్ కనుక రాష్ట్ర సాధన పోరాట తరహాలోనే బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి 42శాతం రిజర్వేషన్లు సాధించుకుంటామని పేర్కొన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, విద్యాసాగర్ రావు, సుంకె రవిశంకర్, వొడితెల సతీశ్ కుమార్,రసమయి బాలకిషన్, దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.
కరీంనగర్ సభకు యావత్ తెలంగాణ కదలి రావాలి
సీఎం ట్రాప్‌లో కాంగ్రెస్ హైకమాండ్
శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి