
విద్యార్థులు కష్టపడి చదవాలి
కరీంనగర్‌క్రైం: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి కె.వెంకటేశ్ గురువారం నగరంలోని బాల సదన్, శిశుగృహను సందర్శించారు. చిన్నారులతో ముచ్చటించా రు. కష్టపడి చదువుకుని ప్రథమస్థానంలో ఉత్తీ ర్ణత సాధించాలని సూచించారు. ఆహార పదార్థాలను నిలువచేసే గదులను తనిఖీ చేశా రు. చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. న్యా యపరమైన సేవ అవసరం ఉంటే సంప్రదించాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు.
ఈ చెత్త ఏమిటి?
● సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహం
కరీంనగర్‌కార్పొరేషన్: ‘ఈ చెత్త ఏమిటి..? ఇంకోసారి కనబడితే బాగుండదు’ అంటూ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్‌దేశాయ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని షట్టర్లు, కా ర్యాలయాన్ని పరిశీలించారు. షటర్లను ఓపెన్ చేసి అందులో పడి ఉన్న చెత్త చెదారం, సామగ్రిని పరిశీలించారు. సామగ్రిని, చెత్త చెదారా న్ని ఎక్కడ పడితే అక్కడ పడేయవద్దంటూ ఆదేశించారు. అదనపు కమిషనర్ సువార్త, డిప్యూ టీ కమిషనర్లు వేణుమాధవ్, ఖాదర్ మొహియొద్దీన్ పాల్గొన్నారు.
ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం
కరీంనగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జూలై 1నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ విజయవంతమైందని జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ ధనలక్ష్మి పేర్కొన్నారు. గురువారం సంబంధిత కార్యాలయంలో కమిటీ సభ్యులు రేండ్ల కళింగ శేఖర్ కే.విజయ్‌కుమార్, రాధ, అర్చనరెడ్డితో కలిసి మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలతో నెలరోజులపాటు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, 102మంది పిల్లలను కాపాడామని తెలిపారు. వీరిలో 98మంది బాలురు, నలుగురు బాలికలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. పోలీసుశాఖ అధికారులు ఎస్‌డీ అన్వర్, ఎస్‌ఐ విజయసాగర్, హెడ్‌కానిస్టేబుల్ కుమారస్వామి, లేబర్ ఆఫీసర్లు చక్రధర్‌రెడ్డి, చందన, రఫీ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఫర్వీన్, శాంత, స్వప్న, కవిత పాల్గొన్నారు.
ఆర్వోబీ నిర్మాణంలో నిర్లక్ష్యం
కరీంనగర్‌రూరల్: తీగలగుట్టపల్లి ఆర్వోబీ డిజైన్ జాప్యంతోనే నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఆరోపించారు. ఆర్వోబీ పనులను గురువారం కాంగ్రెస్‌పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. రైల్వేశాఖ నుంచి స్ట్రక్చరల్ డిజైన్, డ్రాయింగ్స్ మార్చి వరకు పూర్తి కాకపోవడానికి కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ బాధ్యత వహించాలన్నారు. భూసేకరణ కాకపోవడంతోనే ఆర్వోబీ పనులు ఆలస్యమవుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ తెరవెనుక ఉండి డైవర్షన్ రాజకీయాలను చేయడం మానుకుని ఆర్వోబీ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులతో పాటు నూతన లైన్‌ల ఏర్పాటు పనులు చేపడుతున్నందున శుక్రవారం ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు 11 కె.వీ.టవర్ ఫీడర్ పరిధిలోని రాజీవ్‌చౌక్, రూరల్ పోలీస్‌స్టేషన్, భారత్ టాకీస్, టవర్‌సర్కిల్, బ్రాహ్మణవీధి, అహ్మద్‌పుర, ద్వారకానగర్, వాల్మీకినగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1 ఏడీఈ పంజాల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.

విద్యార్థులు కష్టపడి చదవాలి

విద్యార్థులు కష్టపడి చదవాలి

విద్యార్థులు కష్టపడి చదవాలి