కొత్త బట్టలతో మురిసిపోయేటోళ్లం
మాది సొంతూరు బెజ్జంకి దగ్గర దాచారం. నేను పుట్టక ముందే మా నాన్న సిరిసిల్లకు వచ్చాడు. నేను ఇక్కడే పుట్టాను. నా వయసు ఇప్పుడు 63 ఏళ్లు. మా చిన్నప్పుడు ఉగాది పండగ అంటే.. ఇంట్లో కొత్త బట్టలు కుట్టించేవాళ్లు. అవి వేసుకుని మురిసిపోతూ పంచాంగ శ్రవణం వినేవాళ్లం. ఉగాది పచ్చడి ఆకులల్ల పోసేటోళ్లు. ఎంతో సంతోషంగా అది తాగేటోళ్లం. ఇంట్లో పోలెలు చేస్తే.. ఇద్దరు అక్కలు, ఒక చెల్లె, అన్నతో కలిసి ఇంట్లో సంబురంగా తినేవాళ్లం. ఉగాది పండగ అంటే ఇంటిల్లిపాదికి ఎంతో ఆనందం ఉండేది.
– డాక్టర్ గాజుల బాలయ్య, విద్యానగర్, సిరిసిల్ల


