టిప్పర్‌ యూటర్న్‌ తీసుకుంటుండగా.. | Sakshi
Sakshi News home page

టిప్పర్‌ యూటర్న్‌ తీసుకుంటుండగా..

Published Tue, Apr 2 2024 12:10 AM

- - Sakshi

రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం

రాజేశ్వర్‌రావుపేట శివారులో ఘటన

కరీంనగర్: మెట్‌పల్లి మండలం రాజేశ్వర్‌రావుపేట శివారు వరదకాల్వ బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం పాలైంది. కథలాపూర్‌ మండలం పోతారం గ్రామానికి చెందిన వెలుమల దీక్ష(23) నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లిలోని తన అక్క వద్దకు వెళ్లింది. సోమవారం సాయంత్రం తిరుగు ప్రయాణమైంది. తన అక్క భర్త దిలీప్‌ ద్విచక్రవాహనంపై మెట్‌పల్లి వైపు వస్తుండగా.. ఇబ్రహీంపట్నం మండలం ఎర్రాపూర్‌ వైపు నుంచి వరదకాల్వ మీదుగా బండరాళ్ల లోడుతో వస్తున్న టిప్పర్‌ రాజేశ్వర్‌రావుపేట బ్రిడ్జి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా యూటర్న్‌ తీసుకుంది.

దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న దీక్ష, ఆమె బావ తప్పించుకునే క్రమంలో దీక్ష టిప్పర్‌ టైర్‌ కింద పడిపోయింది. టైర్‌ ఆమైపె నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. టిప్పర్‌ అతివేగంగా రావడంతోనే ప్రమాదం జరిగిందని గుర్తించిన పోలీసులు టిప్పర్‌ను ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దిలీప్‌ ఫిర్యాదు మేరకు మధ్యప్రదేశ్‌కు చెందిన టిప్పర్‌ డ్రైవర్‌ ప్రియాంకసింగ్‌పై కేసు నమోదు చేసినట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్‌ తెలిపారు.

ఇవి చదవండి: డిగ్రీ విద్యార్థిని వైష్ణవి ఆత్మహత్య..

Advertisement
 
Advertisement
 
Advertisement