Karimnagar: అద్భుతం.. ఆకర్షణీయం | Sakshi
Sakshi News home page

అద్భుతం.. ఆకర్షణీయం.. కరీంనగర్‌కు కొత్త వెలుగులు

Published Wed, Jun 21 2023 7:20 AM

- - Sakshi

ఎప్పుడెపుడా అంటూ ఎదురుచూస్తున్న తీగల వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న కేబుల్‌ బ్రిడ్జిని ఇవాళ (బుధవారం) మున్సిపల్‌ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించనున్నారు. సాయంత్రం నుంచి ఈ బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతించనున్నారు. వాస్తవానికి గత ఏప్రిల్‌ 14న వంతెన ప్రారంభించాలి. కానీ.. పనులు పూర్తికాకపోవడం.. ఓ సభలో మంత్రి కాలికి గాయంకావడం తదితర కారణాలతో ప్రారంభోత్సవం వాయిదా పడుతూ వచ్చింది. తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ.. పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. రెండురోజుల పాటు ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించాలని మంత్రి గంగుల కమలాకర్‌ నిర్ణయించారు.

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా పర్యాటకంలో కలికితురాయిగా నిలి చే కేబుల్‌ బ్రిడ్జిని తొలుత నగరవాసులకు పరిచయం చేయాలని మంత్రి కమలాకర్‌ నిర్ణయించారు. స్థాని కులు వంతెనపై తిరిగేందుకు వీలుగా ప్రతీ ఆదివా రం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వాహనాలకు అనుమతి నిలిపివేశారు. పర్యాటకులను రంజింపజేసేలా మ్యాజిక్‌ షో, మ్యూజిక్‌ షో, కళకారుల ఆటాపాటలు తదితర వినోద కార్యక్రమాలు సిద్ధంచేశారు. రకరకాల ఫుడ్‌కోర్టులు ఏర్పాటుచేయనున్నారు.దసరా వరకు కు టుంబాలతో వచ్చి సరదాగా గడిపేలా చర్యలు తీసుకుంటున్నారు. వంతెన వద్ద కొరియా సాంకేతికతతో రూ.8 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న డైనమిక్‌ లైటింగ్‌ సిస్టమ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

నేపథ్యమిదీ..
వరంగల్‌ – కరీంనగర్‌ నగరాల మధ్య దాదాపు 7. కి.మీల దూరం తగ్గించడం, హైదరాబాద్‌–కరీంనగర్‌ రహదారిపై ట్రాఫిక్‌ నియంత్రణ కోసం ప్రభుత్వం కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణానికి పూనుకుంది. 2018లో రూ.180 కోట్ల అంచనా బడ్జెట్‌తో పనులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని దుర్గంచెరువు తీగల వంతెన తర్వాత తెలంగాణలో రెండో బ్రిడ్జి కరీంనగర్‌దే కావడం విశేషం. పూర్తిగా విదేశీ పరిజ్ఞానంతో వంతెనను నిర్మించారు.

రేపటి నుంచి కార్పొరేషన్‌ పరిధిలోకి..
వంతెన నిర్వహణ బాధ్యతలు గురువారం నుంచి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ కరీంనగర్‌(ఎంసీకే) చేతుల్లోకి వెళ్లనుంది. వంతెనపై లైటింగ్‌, పారిశుధ్యం నిర్వహణ, విద్యుత్‌ తదితరాలు ఇకపై బల్దియా చూసుకుంటుంది. రెండేళ్లపాటు వంతెనకు సంబంధించిన సాంకేతికపరమైన నిర్వహణను మాత్రం ఆర్‌ అండ్‌ బీ అధికారులు చూస్తారు. వంతెనపై రెండు భారీ పిల్లర్ల అంచున నాలుగు ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేయనున్నారు. వీటిపై ప్రభుత్వ, ప్రైవేటు ప్రకటనలు ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని విజయవంతం చే యాలని మంత్రి కమలాకర్‌ పిలుపునిచ్చారు. అధికా రులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

బ్రిడ్జి విశేషాలు..
500 మీటర్ల పొడవైన రోడ్డు, ఫోర్‌లేన్‌ ఇటలీ నుంచి తెప్పించిన 26 పొడవైన స్టీల్‌ కేబుల్స్‌ వంతెనకు రెండు పైలాన్లు.. వీటి మధ్యదూరం 220 మీటర్లుపైలాన్‌ నుంచి ఇంటర్‌ మీడియన్‌కు దూరం 110 మీటర్లు రూ.180 కోట్ల బడ్జెట్‌.. పూర్తిగా అధునాతన ఇంజినీరింగ్‌ వ్యవస్థ రూ.8 కోట్లతో కొరియా డైనమిక్‌ లైటింగ్‌ సిస్టమ్‌వెడల్పు 21.5 మీటర్లు, ఒక్కోటి 7 మీటర్ల వెడల్పుతో రెండు దారులు రోడ్డుకు ఇరువైపులా 2.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌లు టాటా కంపెనీ సారథ్యంలో నిర్మాణం 2017 డిసెంబర్‌లో నిర్మాణానికి శంకుస్థాపన 2018 ఫిబ్రవరిలో పనులు ప్రారంభం 2023 జనవరి 26న వంతెనపై పనుల కోసం వాహనాలకు అనుమతి2023 జూన్‌ 21న వంతెన ప్రారంభం

పర్యాటక కేంద్రంగా..
కరీంనగర్‌ జిల్లా కేంద్రాన్ని టూరిజం స్పాట్‌గా నిలపాలన్న సీఎం కేసీఆర్‌ ఆలోచనల్లో భాగంగానే తీగల వంతెన ఏర్పాటైంది. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఆయనకు కరీంనగర్‌ మీద ఉన్న మమకారం అలాంటిది. రూ.180 కోట్ల వ్యయంతో కేబుల్‌ బ్రిడ్జి, రూ.410 కోట్లు వెచ్చించి మానేరు పరీవాహక ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు మానేరు రివర్‌ ఫ్రంట్‌(ఎంఆర్‌ఎఫ్‌) ప్రాజెక్టును మంజూరుచేశారు.
– మంత్రి గంగుల కమలాకర్‌

కేటీఆర్‌ పర్యటన ఇలా..
కేబుల్‌ బ్రిడ్జితోపాటు, వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న మున్సిపల్‌, ఐటీ మినిస్టర్‌ కె.తారకరామారావు బుధవారం సాయంత్రం 5 గంటలకు రూ.10 కోట్లతో కశ్మీర్‌గడ్డలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, 5.05 గంటలకు రూ.7 కోట్లు వెచ్చించి నిర్మించనున్న డిజిటల్‌ లైబ్రరీ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.2 కోట్ల వ్యయంతో సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్‌ ప్రారంభించనున్నారు.

సాయంత్రం 5.15 గంటలకు ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, ఐసీసీ వీడియో వాల్‌ కంట్రోల్‌ రూం, 14 జంక్షన్ల ఆటోమేటెడ్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిస్టం (ఏటీసీఎస్‌), 18 చోట్ల ఏర్పాటు చేసిన పబ్లిక్‌ అండ్రసింగ్‌ సిస్టం(పీఏఎస్‌), 8 చోట్ల వేరియబుల్‌ మెసేజింగ్‌ సిస్టం, ఐదుచోట్ల వాతావరణ సూచికలు, 18 ప్రాంతాల్లో వైఫై హాట్‌స్పాట్లు, ఘన వ్యర్థాల నిర్వహణను మంత్రి ప్రారంభిస్తారు. సాయంత్రం 6 గంటలకు కమాన్‌మీదుగా ఓపెన్‌టాప్‌ జీపులో ర్యాలీగా వెళ్లి కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభిస్తారు. అనంతరం ఏర్పాటు చేసిన డైనిమిక్‌ లైటింగ్‌ సిస్టమ్‌కు స్విచ్ఛాన్‌ చేయనున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement