కమ్మర్పల్లి: మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో గ్రీన్ ఫీల్డ్ క్రికెట్ క్లబ్(జీసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన జీసీసీ ప్రీమియర్ లీగ్ సీజన్–1 క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. రెండు వారాలుగా కొనసాగిన రెండు జిల్లాల క్రికెట్ టోర్నమెంట్లో ఫైనల్ పోటీలు మెట్పల్లి ఇర్ఫాన్ దీపక్, లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్పల్లి జట్ల మధ్య జరిగాయి. ఈ పోటీలో ఇర్ఫాన్ దీపక్ టీం విజేతగా నిలువగా, లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్పల్లి జట్టు రన్నర్‌గా నిలిచింది. విజేత జట్టుకు ట్రోఫీతో పాటు రూ.40 వేల నగదు, రన్నర్ జట్టుకు ట్రోఫీతో పాటు రూ. 30 వేల నగదును ఎస్ఐ సతీష్, సర్పంచ్ కొత్తపల్లి హారిక, రెంజెర్ల నర్సారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, ఈర్నాల గంగాధర్, లుక్కా గంగాధర్, జోగ గంగాధర్, తెడ్డు రమేష్, బర్ల సురేష్ పాల్గొన్నారు.


