టీఆర్‌ఎస్‌లో చేరికలు | - | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో చేరికలు

Oct 26 2026 2:46 AM | Updated on Oct 26 2026 2:46 AM

టీఆర్‌ఎస్‌లో చేరికలు రైతు డిక్లరేషన్‌ను అమలు చేయాలి నేడు తాడ్వాయిలో ప్రజావాణి శబరిమాత ఆశ్రమంలో ప్రత్యేక పూజలు వాహనాల తనిఖీ

లింగంపేట్‌: మండలంలోని బాణాపూర్‌, ఉన్నప్పతండాకు చెందిన పలువురు యువకులు ఆదివారం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వీరికి పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి ఎదురుగట్ల సంపత్‌గౌడ్‌ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. నాయకులు రమేశ్‌ రాథోడ్‌, సంతోష్‌, శేఖర్‌, సుభాష్‌, ఆనంద్‌, సురేందర్‌, జైల్‌సింగ్‌, తారాచంద్‌, బాబురావు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

లింగంపేట్‌: రైతు డిక్లరేషన్‌ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 26న చలో మండల ఆఫీసు కార్యక్రమాన్ని చేపట్టినట్లు భారతీయ కిసాన్‌ సంఘ్‌ ప్రతినిధి రాజాగౌడ్‌ తెలిపారు. ఆదివారం ఆయన లింగంపేట్‌ మండలంలోని సజ్జన్‌పల్లి, శెట్‌పల్లి సంగారెడ్డి, పరమళ్ల, లింగంపేట్‌ తదితర గ్రామాలలో చలో మండల ఆఫీసు కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు రాజాగౌడ్‌, మధుసూదన్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

తాడ్వాయి: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీడీవో భరత్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుందని, ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరవుతారన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

తాడ్వాయి: మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శబరిమాత దివ్యసమాది, ప్రతిమ, చిత్రపటాన్ని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

తాడ్వాయి: మండల కేంద్రంలోని కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై పోలీసులు ఆదివారం వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనాల ధ్రువీకరణ పత్రాలు, హెల్మెట్లు ధరించని వారికి జరిమానాలు విధించారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తనిఖీలో కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement