● లాటరీ పద్ధతిలో బిచ్కుంద
నూతన బార్ కేటాయింపు
● 90 దరఖాస్తుల్లో మొదటి టోకెన్‌తో లైసెన్స్ దక్కించుకున్న ఎల్లారెడ్డి వాసి
కామారెడ్డి టౌన్: బిచ్కుందలో బార్ ఏర్పాటు కోసం 90 దరఖాస్తులు రాగా.. లక్కీ డ్రాలో ఒకటో నంబర్‌కే అదృష్టం వరించింది. పట్టణంలోని కలెక్టరేట్లో శుక్రవారం బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేయనున్న నూతన బార్ కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 90 దరఖాస్తులు రాగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించి కేటాయింపును ఖరారు చేశారు. టోకెన్ నంబర్ 1 విజేతగా ఎల్లారెడ్డికి చెందిన అతినారపు భైరవ స్వామి బార్ లైసెన్స్‌ను దక్కించుకున్నారు. జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ముకుందరెడ్డి, ఆబ్కారీ శాఖ అధికారులు, సిబ్బంది, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.


