దోమకొండ: మండలంలోని సీతారంపల్లి గ్రామానికి చెందిన ఎర్ర శంకర్కు గ్రామ శివారులో ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీంట్లో రెండు ఎకరాల్లో వరిపంట వేయగా, మిగతా నాలుగు ఎకరాల్లో పత్తి పంట సాగుచేశాడు. 2 బోర్లు ఉండగా అవి నీరు సరిగా పోయడం లేదు. నీరు లేక ఎండిపోతున్న పంటకు కాపాడుకోవడానికి వాటర్ ట్యాంకర్లతో తడిని అందిస్తున్నాడు. గత 20 రోజులుగా ప్రతిరోజు రెండు ట్యాంకర్లను తీసుకువచ్చి పైపుల ద్వారా పంటకు నీరు అందిస్తునట్లు శంకర్ ‘సాక్షి’కి తెలిపారు. ట్యాంకర్కు రూ.600 చొప్పున రెండు ట్యాంకర్లకు రూ.1200 నిత్యం నీటి కోసం ఖర్చుచేస్తున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరో పది, పదిహేను రోజుల్లో పంట చేతికి వస్తుందని అప్పటివరకు పంటను కాపాడుకోవటానికి పాట్లు పడుతున్నానని ఆయన వాపోయాడు.


