నేడు ‘సాగర్‌’ నీటి విడుదల | - | Sakshi
Sakshi News home page

నేడు ‘సాగర్‌’ నీటి విడుదల

Oct 17 2026 12:46 AM | Updated on Oct 17 2026 12:46 AM

నేడు ‘సాగర్‌’ నీటి విడుదల ఫర్టిలైజర్‌ దుకాణాల తనిఖీ దుకాణాల్లో పరిశుభ్రత పాటించాలి ’ఉపాధి’లో కూలీల సంఖ్యను పెంచాలి రాష్ట్రస్థాయి పోటీలకు తరలిన క్రీడాకారులు

నిజాంసాగర్‌(జుక్కల్‌): వానాకాలం పంటల అవసరాల నిమిత్తం శనివారం నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు మూడవ విడత నీటిని విడుదల చేయనున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు 1,000 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తామన్నారు. ప్రధాన కాలువ వైపు రైతులు, పశువుల కాపర్లు వెళ్లవద్దని వారు హెచ్చరించారు.

నిజాంసాగర్‌(జుక్కల్‌): మహమ్మద్‌నగర్‌ మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో ఉన్న ఫర్టిలైజర్‌ దుకాణాలను శుక్రవారం జిల్లా వ్యవసాయశాఖ అధికారి మోహన్‌రెడ్డి తనిఖీ చేశారు. ఆయా దుకాణాల్లో నిల్వ ఉన్న పురుగు మందులు, కాంఫ్లెక్స్‌, యూరియా ఎరువుల వివరాలను ఆయన తెలుసుకున్నారు. వాటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని దుకాణాల నిర్వాహకులకు సూచించారు. ఇన్‌చార్జి వ్యవసాయశాఖ అధికారిణి అచరిత, ఏఈవో మదుసూధన్‌, దుకాణాల నిర్వహకులు ఉన్నారు.

బాన్సువాడ: వ్యాపారులు దుకాణాల్లో పరిశుభ్రతను పాటించాలని ఫుడ్‌ సేఫ్టీ అధికారి విక్రమ్‌ అన్నారు. పట్టణంలోని స్వీట్స్‌, బేకరి దుకాణాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ రిజిస్ట్రేషన్‌, లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న దుకాణాలను గుర్తించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పలు దుకాణాల్లోని అనుమానాస్పద ఆహార నమూనాలను విశ్లేషణ నిమిత్తం ల్యాబ్‌కు పంపించామన్నారు. పరిశుభ్రత పాటించని వ్యాపారులకు నోటీసులు జారీ చేశామన్నారు. వినియోగదారులు పరిశుభ్రత పాటించే దుకాణాల్లో మాత్రమే ఆహార పదార్థలు కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసే ముందు లేబుళ్లు సరిగా చదివి కొనుగోలు చేయాలని సూచించారు.

మద్నూర్‌/బిచ్కుంద(జుక్కల్‌): వీబీజీ రామ్‌ జీ (ఉపాధి హామీ) పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని, ప్రతి కూలీకి పని కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జెడ్పీ సీఈ వో చందర్‌ నాయక్‌ అన్నారు. బిచ్కుందలో ఉపాధి హామీ సిబ్బంది, జీపీ కార్యదర్శుల తో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీఈవో మాట్లాడుతూ.. గ్రామాల్లో వ్యవసాయ పనులు తగ్గిపోయి, కూలీలకు పనులు దొరకడం కష్టంగా ఉందన్నారు. అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లి కూలీల పనిదినాలు పెంచడంతోపాటు కూలీల సంఖ్య పెంచాలని వివరించారు. భూగర్భ జలాలు పెంపుదల కోసం ఇంకుడు గుంతలు, బోర్‌వెల్‌ రీచార్జీ, మురికి, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే డోంగ్లీ మండల కేంద్రంలోని చెరువు వద్ద కొనసాగుతున్న ఉపాధిహామీ పనులను జెడ్పీ సీఈవో పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఫాంపాండ్స్‌ పనుల పురోగతిని, కమ్యూనిటీ సోక్‌ పిట్‌, డ్రైన్‌ అండ్‌ ఎండ్‌ సోక్‌ పిట్‌ పనులపై ఆయన చర్చించారు. ఎంపీడీవో గోపాల్‌, ఎంపీవో కృష్ణ, ఏపీవో పాల్గొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అండర్‌–14,17 బాలబాలికల రగ్బీ పోటీలకు శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా క్రీడాకారులు తరలివెళ్లారు. వారి వెంట కోచ్‌, మేనేజర్‌ పీడీ నాగరాజు, స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కామారెడ్డి జిల్లా కార్యదర్శి శ్రీధర్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement