జన గణన విధులను పక్కాగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

జన గణన విధులను పక్కాగా నిర్వహించాలి

Oct 17 2026 12:46 AM | Updated on Oct 17 2026 12:46 AM

జన గణన విధులను పక్కాగా నిర్వహించాలి

కామారెడ్డి టౌన్‌: ‘జన గణన’లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా క్షేత్రస్థాయిలో సిబ్బంది విధులను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ ఆదేశించారు. పట్టణంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం జనాభా గణన రెండో దశకు సంబంధించి సెన్సెస్‌ ఛార్జ్‌ క్లర్క్‌లు, సాంకేతిక సహాయకులకు రెండు రోజుల ప్రత్యేక శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే సమయంలో నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, ప్రతి ఒక్కరి సమాచారాన్ని బాధ్యతాయుతంగా నమోదు చేయాలన్నారు. మాస్టర్‌ ట్రైనర్లు జనాభా గణనకు సంబంధించిన 40 రకాల ప్రశ్నలు, సమాచార సేకరణ పద్ధతులు, స్వీయ గణన (సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌) ప్రక్రియ, సీఎంఎంఎస్‌ పోర్టల్‌లో సాంకేతిక అంశాలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. సీపీవో రఘునందన్‌, జిల్లా గణాంకాల కార్యాలయ మాస్టర్‌ ట్రైనర్లు భుక్య రవికుమార్‌, యుగంధర్‌ బాబు, సెన్సెస్‌ ఛార్జ్‌ క్లర్క్‌లు, సాంకేతిక సహాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement