ఎన్నికలపై అవగాహన కలిగి ఉండాలి
సదాశివనగర్ : వి ద్యార్థులు ఎన్నికల పై కనీస అవగాహ న కలిగి ఉండాలనే ఉద్దేశంతో మండలంలోని ధ ర్మారావ్‌పేట్ ఉన్న త పాఠశాలలో శనివారం మాక్ ఎలక్షన్స్‌ను బ్యా లెట్ పేపర్‌తో నిర్వహించినట్లు పాఠశాల ప్రధానో పాధ్యాయుడు, ఎంఈవో యోసెఫ్ తెలిపారు. ఈ సందర్భంగా ఓటు వేసే విధానం, స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికలు, ఓట్ల లెక్కింపుపై అవగాహన కల్పించారు. ఓటు ప్రాధాన్యతను వివరించారు. ఈ ఎన్నికల్లో బాలుర విభాగం నుంచి ఎం. చంద్రకాంత్, బాలికల విభాగం నుంచి ఎం.శ్రీనిత పాఠశాల లీడర్లుగా ఎన్నికయ్యారు. సర్పంచ్ ఉమ ర్, ఉప సర్పంచ్ అశోక్ రెడ్డి, పాఠశాల సేవకుడు రా మాంజనేయులు, అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు ప్రమీల,బాల్‌రాం,తదితరులు పాల్గొన్నారు.
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
పిట్లం: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ప్రాథమికోన్నత స్థాయి గణిత కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి దేవిసింగ్ మాట్లాడుతూ చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి బోధించాలని సూచించారు. అనంతరం ఆర్పీలు సెషన్ల వారీగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పిట్లం, పెద్దకొడప్‌గల్, నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సులభ పద్ధతిలో బోధించాలి
లింగంపేట: విద్యార్థులకు అర్థమయ్యో విధంగా సులభ పద్ధతిలో బోధించాలని ఎంఈవో అంజల్‌రెడ్డి సూచించారు. శనివారం ఆయన మండలంలోని పర్మళ్ల తండా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల ప్రగతిని పరిశీలించారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం తప్పనిసరిగా నేర్పించాలన్నారు. హెచ్‌ఎం రాజారెడ్డి, తదితరులున్నారు.
బోధనోపకరణాలతో ..
లింగంపేట : బోధనోపకరణాలను ఉపయోగించి బోధించాలని లింగంపేట బాలుర ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వహీద్‌సిద్ధిఖీ సూచించారు. శనివారం ఆయన లింగంపేట బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. అలాగే బాలికల ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ సమావేశంలో ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి మాట్లాడారు. ప్యానల్ టీమ్ బృందం సూచించిన సలహాలను పాటించి విద్యార్థులకు విద్యా బోధన చేయాలన్నారు. నల్లమడుగు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు కోటేశ్వర్‌రావు సెక్రటరీ రాములు, రిసోర్స్ పర్సన్స్ మహిపాల్, శ్రీనివాస్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నీటి వృథాకు అడ్డుకట్ట
మాచారెడ్డి: మండలంలోని చుక్కాపూర్ గ్రామ పంచాయతీ 9వ వార్డు ప్రజలు నీటి వృథాకు అడ్డుకట్ట వేసి ఆదర్శంగా నిలిచారు.వార్డు ప్రజల సౌకర్యార్థం సర్పంచ్ ఆంజనేయులు బోరు వేయించి మోటారు బిగించారు. బహిరంగ ప్రదేశంలో నీళ్లు పట్టుకోవడంతో నీరు వృథా అవుతుందని గ్రహించిన వార్డు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అందరూ కలిసి డబ్బులు సమకూర్చి ఇంటింటికి పైపు లైన్ వేసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆంజనేయులు, ఉప సర్పంచ్ బాబు శనివారం వార్డులో పర్యటించి వారిని అభినందించారు. ఇతర వార్డుల ప్రజలు కూడా వీరిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
కెరీర్ గైడెన్స్‌పై విద్యార్థులకు అవగాహన
బాన్సువాడ రూరల్: మండలంలోని బోర్లం క్యాంపులో తెలంగాణ సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో శనివారం కెరీర్ గైడెన్స్, స్టూడెంట్ కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ శారద వెంకటేశ్ తెలిపారు. విద్యార్థులకు వివిధ ఉద్యోగ అవకాశాలు, విద్యా మార్గాలు, వ్యక్తిగత ఆరోగ్యం, సానుకూల ప్రవర్తన ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ సదస్సును ఇద్దరు అనుభవజ్ఞులైన డా.సబితా దాసరి, స్వప్న బలివాడలు రిసోర్స్ పర్సన్లు గా వ్యవహరించారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గడికోటను సందర్శించిన జీపీ కార్యదర్శులు
దోమకొండ: భిక్కనూరు మండలంలోని పలు గ్రామపంచాయతీ మహిళా కార్యదర్శులు శనివారం దోమకొండ మండల కేంద్రంలో గల గడికోటను సందర్శించారు. ఎంపీడీవో సవితారెడ్డి ఆధ్వర్యంలో గడికోటలో ఉన్న అద్దాల మేడ, ఫౌంటెన్ గార్డెన్, మహదేవుని ఆలయం, వెంకటపతిభవన్ తదితర కట్టడాలను వారు తిలకించారు.


