ముగిసిన ఆర్చరీ ఎంపిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఆర్చరీ ఎంపిక పోటీలు

Sep 27 2026 3:40 AM | Updated on Sep 27 2026 3:40 AM

ముగిసిన ఆర్చరీ ఎంపిక పోటీలు విజ్ఞానయాత్రలో విద్యార్థులు మహిళ కడుపులో నుంచి ఫైబ్రాయిడ్‌ గడ్డ తొలగింపు

బాన్సువాడ రూరల్‌: మండలంలోని కొత్తాబాది జెడ్పీ హైస్కూల్‌ ఆవరణలో శనివారం నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాస్థాయి ఆర్చరీ ఎంపిక పోటీలు ముగిశాయి. పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ఈసందర్భంగా వారిని మండల విద్యాధికారి నాగేశ్వరరావు, గ్రామస్తులతో కలిసి మెడల్స్‌ బహూకరించి, సన్మానించారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కుషాల్‌, హెచ్‌ఎం శ్రీనివాస్‌, ఉప సర్పంచ్‌ సలీం, మాజీ సర్పంచ్‌ సాయిలు, కోచ్‌ పీరియా, నాయకులు వెంకట రమణ, మంద ప్రవీణ్‌, దాసరి రవీందర్‌, శ్రీనివాస్‌, భూమేష్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌ : జిల్లా కేంద్రంలోని సాందీపని డిగ్రీ కళాశాల లైఫ్‌ సైన్సెస్‌ విద్యార్థులు శనివారం హైదరాబాద్‌కు విజ్ఞానయాత్రకు తరలివెళ్లారు. హబ్సిగూడలో గల ప్రముఖ పరిశోధనా సంస్థ సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీఎస్‌ఐఆర్‌–సీసీఎంబీ)ని విద్యార్థుల బృందం సందర్శించారు. కణాలు, జీవుల అంతర్గత జీవక్రియల పనితీరును స్వయంగా పరిశీలించడంతో పాటు వైద్య, వ్యవసాయ, వన్యప్రాణి సంరక్షణ రంగాల్లో పరిశోధనల ప్రాధాన్యతను శాస్త్రవేత్తల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం తార్నాకలోని ‘సపల ఆర్గానిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పరిశ్రమను సందర్శించి, వైద్యరంగంలో వినియోగించే ముడి పదార్థాలు, ఔషధాల తయారీ విధానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌. సాయిబాబు, లైఫ్‌ సైన్సెస్‌ విభాగాధిపతి పి. బాలనర్సు, అధ్యాపకులు అంజనీ భార్గవి, నివేదిత, మన్విత, మాధురి, విద్యార్థులు పాల్గొన్నారు.

దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ వంద పడకల ఆస్పత్రిలో వైద్యులు అరుదైన ఆపరేషన్‌ చేసి మహిళ ప్రాణాలు కాపాడారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ , సర్జన్‌ హేమరాజ్‌సింగ్‌ ఆధ్వర్యంలో శనివారం ఈ ఆపరేషన్‌ చేశారు. వివరాలు ఇలా..కామారెడ్డి జిల్లా ఫరీద్‌పేట గ్రామానికి చెందిన కవిత(44) కొన్నేళ్లుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ వివిధ ఆస్పత్రులకు వెళ్లినా నయం కాలేదు. ఈ క్రమంలో దుబ్బాక ఆస్పత్రికి రాగా ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించి కడుపులో ఫైబ్రాయిడ్‌ గడ్డ ఉందని వైద్యులు గుర్తించారు. దీంతో ఆమెకు ఆపరేషన్‌ చేసి కడుపులోంచి 6.1 కేజీల గడ్డను తొలగించారు. ప్రస్తుతం కవిత ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ ఆపరేషన్‌లో గైనకాలజిస్టు స్రవంతి, వైద్యులు ప్రేమ్‌కిశోర్‌, ఆస్మా, పూజ, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. కాగా శనివారం దుబ్బాక ఆస్పత్రిలో ఒకే రోజు ఆరోగ్యశ్రీ కింద 15 ఆపరేషన్లు చేసినట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హేమరాజ్‌సింగ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement