కామారెడ్డి అర్బన్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. చైర్మన్‌గా ముక్కర సంజీవరెడ్డి, వైస్ చైర్మన్‌గా గొనేకర్ దస్తిరామ్, ట్రెజరర్‌గా గడ్డం రమేశ్‌రెడ్డి, స్టేట్ మేనేజింగ్ కమిటీ మెంబర్‌గా ఎం.జైపాల్‌రెడ్డిలు ఎన్నికయ్యారు. పాలకవర్గం ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్టు ఎన్నికల అధికారి పి.రాంమోహన్, డిప్యూటీ ఎన్నికల అధికారి టి.ప్రశాంత్‌రెడ్డిలు తెలిపారు. 31 నామినేషన్లు దాఖలు కాగా 16 మంది ఉపసంహరించుకోగా 15 మంది ఏకగ్రీవం అయ్యారని, వీరిలో నాలుగు పదవులు పోగా మిగతా 11 మంది అమృత దత్తాద్రి, గర్ధాస్ గోవర్ధన్, జోషి శ్రీధర్, మానేటి కృష్ణ, కుసుమ శ్రీకాంత్, మర్రి సదాశివరెడ్డి, ఏ.నాగరాజుగౌడ్, నరాల వెంకట్‌రెడ్డి, ఎన్.బాలచంద్రం, పడియార్ కిరణ్, మారవేణి రాజన్నలు డైరెక్టర్లుగా కొనసాగుతారని వివరించారు.


