నిజాంసాగర్(జుక్కల్): ఆయకట్టు కింద సాగు చేస్తున్న వానాకాలం పంటల అవసరాల కోసం శనివారం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటి విడుదల చేపట్టారు. అలీసాగర్ రిజర్వాయర్ వరకు సుమారు 1.30 లక్షల ఎకరాల పంటలకు రెండో దఫా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన కాలువకు 1,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని, మరో 500 క్యూసెక్కుల వరకు పెంచుతామని అధికారులు తెలిపారు. ప్రధాన కాలువలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్నందున రైతులు, పశువుల కాపర్లు కాలువ వైపు వెళ్లవద్దని నీటిపారుదల శాఖ అధికారులు సూచించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు 17.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1401.08 అడుగులు 12.566 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు.


