మండలాల్లో..
● జిల్లాకేంద్రంలో 22,206 మందికి
నోటీసులు జారీ
● హియరింగ్‌కు 11,029 మందే..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ కొనసాగుతోంది. అనామలిస్ జాబితాలో ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేసి హియరింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లాలో 1,73,216 మంది ఓటర్లకు నోటీసులు జారీ కాగా.. 1,12,404 మంది హియరింగ్‌కు హాజరయ్యారు. మిగిలినవారు హియరింగ్‌కు దూరంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కాగా ఈ ప్రక్రియకు పట్టణ ఓటర్ల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో 26,108 మందికి నోటీసులు సిద్ధం చేసి, 22,206 మందికి అందజేశారు. ఇంకా 3,902 మందికి నోటీసులు చేరాల్సి ఉంది. అయితే నోటీసుల్లో పేర్కొన్న తేదీలలో 11,029 మంది మాత్రమే హియరింగ్‌కు హాజరయ్యారు. అందులో 8,988 మంది వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఫైనల్ పబ్లికేషన్‌లో చేర్చనున్నారు. మిగిలినవారు హియరింగ్‌కు హాజరుకాలేదు. కామారెడ్డి మండలంలోని గ్రామాల్లో కూడా ఓటర్లు ఆసక్తి చూపడం లేదు. 11,716 మందికి నోటీసులు జారీ కాగా.. 4,591 మంది మాత్రమే హియరింగ్‌కు హాజరై ఆధారాలను సమర్పించారు. మిగతా ప్రాంతాల్లో ఓటర్లు తమకు వచ్చిన నోటీసులను పట్టుకుని బీఎల్‌వోల దగ్గరకు వెళ్లి ఆధారాలను సమర్పించడానికి ఆసక్తి చూపుతుంటే కామారెడ్డి పట్టణంలో మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. అనామలిస్ జాబితాలో ఉన్న ఓటర్లలో 34.08 శాతం మాత్రమే సరైన ఆధారాలు చూపించారని అధికారులు చెబుతున్నారు.
మిగతా పట్టణాలలో..
బిచ్కుంద పట్టణంలో నోటీసులు అందుకున్నవారు హియరింగ్‌కు హాజరై వివరాలు సమర్పిస్తున్నారు. ఇక్కడ 1,937 మందికి నోటీసులు జారీ చేయగా.. 1,649 మంది హియరింగ్‌కు హాజరయ్యారు.
ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 3,644 మందికి నోటీసులు జారీ కాగా.. 2,773 మంది హియరింగ్‌కు హాజరయ్యారు.
బిచ్కుంద మండలంలో 92.52 శాతం మంది హియరింగ్‌కు హాజరయ్యారు. రాజంపేట మండలంలో 92.52 శాతం మంది, ఎల్లారెడ్డి మండలంలో 90.30 శాతం, పాల్వంచలో 86.91 శాతం, డోంగ్లీలో 84.31 శాతం, నాగిరెడ్డిపేటలో 80.78 శాతం, పిట్లంలో 76.14 శాతం హియరింగ్‌కు హాజరై ఆధారాలు సమర్పించారు.


