అధ్వానంగా గ్రామీణ రోడ్లు | - | Sakshi
Sakshi News home page

అధ్వానంగా గ్రామీణ రోడ్లు

Sep 24 2026 1:54 AM | Updated on Sep 24 2026 1:54 AM

అధ్వానంగా గ్రామీణ రోడ్లు

నిధులు మంజూరైనా

ప్రారంభం కాని ప్యాచ్‌ వర్క్‌లు

గుంతలతో ఇబ్బందిపడుతున్న

వాహనదారులు

ఎల్లారెడ్డిరూరల్‌: గ్రామీణ రహదారులు అధ్వానంగా మారాయి. రోడ్డు దెబ్బతిని గుంతలమయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి, వెల్లుట్ల, అడివిలింగాల, కల్యాణి గ్రామాలకు వెళ్లే రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గుంతల మరమ్మతుల కోసం నిధులు మంజూరైనప్పటికీ రోడ్డు ప్యాచ్‌ వర్కులు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీంతో పనులు జరగడం లేదు. మరోవైపు గుంతల దారిలో ప్రయాణించడానికి వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, వాహనాలు చెడిపోతున్నాయని పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి త్వరగా ప్యాచ్‌ వర్క్‌లు ప్రారంభమయ్యేలా చూడాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎల్లారెడ్డి పంచాయతీరాజ్‌ ఏఈ పిచ్చయ్యను వివరణ కోరగా.. అడివిలింగాల, తిమ్మారెడ్డి, వెల్లుట్ల గ్రామాలకు సంబంధించిన రోడ్ల మరమ్మతులకు టెండర్‌ ప్రక్రియ పూర్తయ్యిందని, అగ్రిమెంట్‌ పూర్తి కాగానే పనులను ప్రారంభిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement