భద్రతకు ప్రాధాన్యతనివ్వాలి | - | Sakshi
Sakshi News home page

భద్రతకు ప్రాధాన్యతనివ్వాలి

Sep 24 2026 1:54 AM | Updated on Sep 24 2026 1:54 AM

కామారెడ్డి క్రైం: గణేశ్‌ శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని, ప్రతి ఒక్కరూ భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఉత్సవాలను సురక్షితంగా నిర్వహించుకోవాలని ఎస్పీ రాజేశ్‌ చంద్ర సూచించారు. కామారెడ్డిలోని కల్కి, ఏకదంత, శివసేన, బాల గణేష్‌ మండపాలను బుధవారం సందర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వినాయక నిమజ్జనం జరిగే అడ్లూర్‌ ఎల్లారెడ్డి (టేక్రియాల్‌) చెరువు ప్రాంతాన్ని సందర్శించి అధికారులకు సూచనలిచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణ, ప్రజల భద్రత, పార్కింగ్‌, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచడంలాంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్‌, టౌన్‌ ఎస్‌హెచ్‌వో నరహరి, రూరల్‌ సీఐ శ్రీధర్‌, దేవునిపల్లి ఎస్సై రంజిత్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement