అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం

Jul 24 2026 1:09 AM | Updated on Jul 24 2026 1:09 AM

అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం

లింగంపేట: అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు పేర్కొన్నారు. గురువారం ఆయన లింగంపల్లి పాముల వాగు హైలెవల్‌ వంతెన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 4 కోట్లతో ఈ వంతెన నిర్మాణం చేపట్టామన్నారు. అనంతరం మోతె శివారులో చేపట్టిన యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిని తెలుసుకున్నారు. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత ఎల్లారెడ్డి నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన, ఆధునిక విద్య అందుబాటులోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సాయిరాం యాదవ్‌, నాయకుడు నారాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement