స్కూల్‌ యూనిఫాం కటింగ్‌ పరిశీలన | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌ యూనిఫాం కటింగ్‌ పరిశీలన

Jul 24 2026 1:09 AM | Updated on Jul 24 2026 1:09 AM

స్కూల్‌ యూనిఫాం కటింగ్‌ పరిశీలన ‘సంఘాలలో చేర్పించాలి’ ‘వైద్యసేవలను వినియోగించుకోవాలి’ లబ్ధిదారుల ఈ–కేవైసీ చేయించాలి

దోమకొండ: మండల పరిషత్‌ కార్యాలయంలో రెసిడెన్షియల్‌ స్కూల్‌ యూనిఫాం క్లాత్‌ కటింగ్‌ను గురువారం డీఆర్‌డీవో దామోదర్‌ పరిశీలించారు. యూనిఫాం స్టిచ్చింగ్‌ విషయంలో టైలర్‌లకు సూచనలు ఇచ్చారు. త్వరగా కుట్టి అందించాలని సూచించారు. అనంతరం మహిళా సంఘం సభ్యులు తయారు చేస్తున్న ఫినాయిల్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ను పరిశీలించి వారిని అభినందించారు. ఆయన వెంట ఎంపీడీవో మధురిమ, డీపీఎం సాయిలు, ఏపీఎం శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

నాగిరెడ్డిపేట: సంఘాలలో లేని మహిళలను నెలాఖరులోగా సంఘాలలో చేర్పించాలని అడిషనల్‌ డీఆర్‌డీవో విజయలక్ష్మి సూచించారు. మండలంలోని ఐకేపీ కార్యాలయంలో గురువారం వీవోఏలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ, రికవరీపై ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యం చేరుకోవాలని సూచించారు. మండలంలో సీ్త్రనిధి రుణాల రికవరీ కోసం ఐబీ డీపీఎం శ్రీనివాసరావును ప్రత్యేకాధికారిగా నియమించామన్నారు. మండలంలో సీ్త్రనిధి రుణాల రికవరీ నెలక్రితం 11 శాతం ఉండేదని, ఇప్పుడు 23 శాతానికి చేరుకుందని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం మహిళలు, వృద్ధులు, వికలాంగులకు సంబంధించి మొత్తం 17,842 సంఘాలున్నాయని, వాటిలో 1,81,886 మంది సభ్యులున్నారని పేర్కొన్నారు. సమావేశంలో సీ్త్రనిధి రీజనల్‌ మేనేజర్‌ కిరణ్‌కుమార్‌, మండల సమాఖ్య అధ్యక్షురాలు శాంత, ఇన్‌చార్జి ఏపీఎం దత్తయ్య, సీసీలు నజీర్‌, సాయిలు, సావిత్రి, అకౌంటెంట్‌ రాజు, ఆపరేటర్‌ రవి తదితరులు పాల్గొన్నారు.

నాగిరెడ్డిపేట/లింగంపేట: ప్రభుత్వాస్పత్రుల్లో అందించే వైద్యసేవలను ప్రజలు వినియోగించుకోవాలని డీఎంహెచ్‌వో వెంకట్‌ సూచించారు. నాగిరెడ్డిపేట, లింగంపేట పీహెచ్‌సీలలో గురువారం ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు, వైద్యసిబ్బందితో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఆయా సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో గర్భిణుల ప్రసవాలకు సంబంధించి హైరిస్క్‌ కేసులపై ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవల గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. గర్భిణుల రిజిస్ట్రేషన్‌, చెకప్‌లను సకాలంలో చేయాలని సూచించారు. అర్హులైనవారికి హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేయించాలన్నారు. లక్ష్యాలను వంద శాతం సాధించాలని సూచించారు. కార్యక్రమాలలో ఎల్లారెడ్డి డిప్యూటీ డీఎంహెచ్‌వో నర్సింగ్‌ చౌహాన్‌, ప్రోగ్రాం ఆఫీసర్‌ వెంకటస్వామి, నాగిరెడ్డిపేట పీహెచ్‌సీ డాక్టర్‌ సృజన్‌కుమార్‌, లింగంపేట మండల వైద్యాధికారి హిమబిందు, సిబ్బంది సిద్దిరామేశ్వర్‌, సంతోష్‌, విజయ్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

దోమకొండ: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో రేషన్‌ డీలర్లు లబ్ధిదారుల ఈకేవైసీని కచ్చితంగా చేయించాలని తహసీల్దార్‌ స్వప్న అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో మండలానికి చెందిన రేషన్‌డీలర్లతో సమావేశం నిర్వహంచి మాట్లాడారు. ఈనెల 24 నుంచి 31 వ తేదీ వరకు ఈకేవైసీ చేయించాలని కోరారు. ప్రతి ఒక్క రేషన్‌ డీలర్‌ ప్రతి రేషన్‌కార్డు లబ్ధిదారుల పేర్లు ఇంతకు ముందు ఈ కేవైసీ చేయించారని వారిలో కొందరివి కాలేదని వారిని గుర్తించి పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్‌ భిక్షపతి, ఆర్‌ఐ వెంకటలక్ష్మి, రేషన్‌ డీలర్లు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement