నాయకమ్మ ఆలయం ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

నాయకమ్మ ఆలయం ధ్వంసం

Feb 22 2026 7:09 AM | Updated on Feb 22 2026 7:09 AM

నాయకమ

నాయకమ్మ ఆలయం ధ్వంసం

నాయకమ్మ ఆలయం ధ్వంసం విద్యాభ్యున్నతికి సహకరించాలి ఆలయ నిర్మాణానికి రూ. 2.51 లక్షల విరాళం సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సక్రూనాయక్‌

కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని పెద్దవాగు సమీపంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న నాయకమ్మ ఆలయం ధ్వంసమైన ఘటన శనివారం సాయంత్రం జరిగింది. ఏదైనా వాహ నం అదుపుతప్పి ఢీకొన్నదా, లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారా అనే దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థా నికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపడుతున్నారు.

నిజాంసాగర్‌(జుక్కల్‌): ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అభ్యున్నతికి తల్లిదండ్రులు తమ వంతు సహకారం అందించాలని ఎంపీడీవో శివకృష్ణ సూచించారు. శనివారం అచ్చంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల సమావేశానికి ఎంపీడీవో హాజరయ్యా రు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని చెప్పారు. గ్రామ సర్పంచ్‌ లక్ష్మయ్య, ప్రధానోపాధ్యాయులు లాల్‌సింగ్‌, వెంకట్రాంరెడ్డి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఉత్తర శబరిమల అయ్యప్ప ఆలయానికి లింగంపే ట గ్రామానికి చెందిన ముప్పిడి లావణ్య నగేష్‌ శనివారం రూ.2.51 లక్షలు విరాళంగా ఆలయ ధర్మకర్త రవిగౌడ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏప్రిల్‌ 1న ఉత్తర శబరిమల అయ్యప్ప ఆలయ నిర్మాణం పూర్తి చేసుకొని విగ్రహ ప్రాణప్రతిష్ఠ, ప్రారంభో త్సవం ఉన్నందున ఆలయానికి కావలసిన త లుపులు కొనుగోలు చేయడానికి విరాళం అందజేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు దాతను సన్మానించా రు. అయ్య ప్ప సేవా సమితి సభ్యులు శ్రీకాంత్‌, బిట్టు, రాజిరెడ్డి,చంద్రమౌళి,సిద్దాగౌడ్‌ పాల్గొన్నారు.

లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సక్రూనాయక్‌ ఎన్నికయ్యారు. శనివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నికలు నిర్వహించారు. మండలంలోని 41 గ్రామ పంచాయతీలకు సర్పంచులు ఉండగా 35 మంది సర్పంచులు హాజరయ్యారు. మండల సర్పంచుల ఫోరం అధ్యక్ష పదవి కోసం ముగ్గురు పోటీ పడ్డారు. మాలోత్‌సంగ్యానాయక్‌ తండాకు చెందిన సకృనాయక్‌, శెట్పల్లికి చెందిన అట్టెం శ్రీనివాస్‌, లింగంపేటకు చెందిన కౌడ రవీందర్‌లు పోటీ పడగా మండల పార్టీ అధ్యక్షుడు బుర్ర నారాగౌడ్‌ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. సకృనాయక్‌కు 18 ఓట్లు రాగా శ్రీనివాస్‌కు 14 ఓట్లు, రవీంరద్‌కు 2 ఓట్లు వచ్చాయి. దాంతో సక్రూనాయక్‌ గెలుపొందినట్లు ప్రకటించారు. అనంతరం సకృనాయక్‌ను సర్పంచులు ఘనంగా సన్మానించారు. టపాకాయలు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. కాంగ్రెస్‌ నేతలు రఫియోద్దీన్‌, దశరథ్‌ నాయక్‌, సర్పంచులు పాల్గొన్నారు.

నాయకమ్మ ఆలయం ధ్వంసం 1
1/2

నాయకమ్మ ఆలయం ధ్వంసం

నాయకమ్మ ఆలయం ధ్వంసం 2
2/2

నాయకమ్మ ఆలయం ధ్వంసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement