తాడ్వాయి పోలీస్ స్టేషన్‌కు కాంగ్రెస్ నేతల తరలింపు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్‌అలీ మధ్యల జరుగుతున్న మాటల సవాళ్లపై కామారెడ్డిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. దీంతో కామారెడ్డిలో ఎలాంటి గొడవలు జరుగకుండా ముందస్తు చర్యగా శనివారం పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులను తాడ్వాయి పోలీసు స్టేషన్‌కు తరలించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మద్దిచంద్రకాంత్‌రెడ్డి, నాయకులు కై లాస్ శ్రీనివాస్, పండ్ల రాజు, శ్రీనివాస్, ఇర్షాదుద్దీన్, 200మంది నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
బిచ్కుంద(జుక్కల్): బాన్సువాడలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా బీజేపీ నాయకులు శనివారం బాన్సువాడ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో జిల్లా బీజేవైఎం, జిల్లా బీజేపీ నాయకులు బాన్సువాడ రావడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి బిచ్కుంద పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రెండు వర్గాల నాయకులను తీసుకొచ్చారు. జిల్లా బీజేవైఎం నాయకులు రాజాసింగ్, సాయికరణ, తదితరులను బిచ్కుంద పొలీస్ స్టేషన్‌లో ఉంచారు. సమాచారం తెలుసుకున్న బిచ్కుంద బీజేసీ నాయకులు పోలీసుల బలంతో అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు.. వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.
దోమకొండ: మండల కేంద్రంలోని త్రివేణి హైస్కూల్‌లో శనివారం సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. వి ద్యార్థులు పలు ఆసక్తికర ప్రాజెక్ట్‌లను తయారు చేసి ప్రదర్శించారు. వాటిని తయారు చేసిన విధానం, పనిచేసే విధానం గురించి వివరించారు. ప్రాజెక్టు లు తయారు చేసిన విద్యార్థులను స్థానిక ప్రజాప్రతినిధులు అభినందించారు. మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమలగౌడ్, గ్రామ సర్పంచి ఐరేని నర్సయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్‌రెడ్డి, నాయకులు బత్తిని సిద్ధరాములు, పాఠశాల కరస్పాండెంట్ నవీ న్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
మాచారెడ్డి: ఘన్‌పూర్(ఎం) ఉన్నత పాఠశాలలో శనివారం స్కౌట్స్‌డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ నిర్వహించిన పలు విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. స్కౌ ట్స్ అండ్ గైడ్స్ జిల్లా కమిషనర్ గోపాలకృష్ణ్ణ, పాఠశాల హెచ్‌ఎం శారద, ఉపాధ్యాయులు ఉన్నారు.
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌కు కాంగ్రెస్ నేతల తరలింపు
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌కు కాంగ్రెస్ నేతల తరలింపు


